Dheera Censor: ‘ధీర’ సెన్సార్ పూర్తి.. మాస్‌ యాక్షన్‌తో వస్తున్న లక్ష్‌ చదలవాడ

Dheera Movie Censor: యువ హీరో లక్ష్‌ చదలవాడ మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మాస్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న 'ధీర' సినిమా టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకోగా తాజా సెన్సార్‌ పూర్తి చేసుకుంది. భారీ అంచనాలు నెలకొన్న సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Feb 1, 2024, 06:41 PM IST
Dheera Censor: ‘ధీర’ సెన్సార్ పూర్తి.. మాస్‌ యాక్షన్‌తో వస్తున్న లక్ష్‌ చదలవాడ

Laksh New Movie: వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి విజయవంతమైన సినిమాలతో హీరోగా లక్ష్ చదలవాడకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ‘ధీర’తో మాస్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్‌ పూర్తయ్యింది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేయడంతో సినిమా బృందం హర్షం వ్యక్తం చేసింది.

భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమాలో లక్ష్ సరసన సోనియా భన్సాల్, నేహా పఠాన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ధీర సినిమా ఫిబ్రవరి 2న శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లు ఆకట్టుకోగా.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దిగ్గజ నిర్మాత దిల్ రాజు, ప్రముఖ దర్శకులు గోపీచంద్ మలినేని, త్రినాథరావు నక్కిన, బెక్కెం వేణుగోపాల్ వంటి వారు వచ్చి సినిమాకు అండగా నిలిచారు. ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని, విజయవంతం కావాలని ఆకాంక్షించారు. 

ఈ సినిమాను చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు. ఈ చిత్రం నైజాం, వైజాగ్ హక్కుల్ని దిల్ రాజు కొనేయడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై పాజిటివ్‌ టాక్‌ మొదలైంది. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. సినిమా బాగుందని, సరైన మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీ అని సెన్సార్‌ బోర్డు సభ్యులు ప్రశంసించారని సమాచారం. మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు నటించిన ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందించాడు.

Also Read: Drunker Ambulance Call: తాగుబోతు అతి తెలివి.. నడవలేక అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి పిలుపు

Also Read: Union Budget 2024 IT Slabs: ఉద్యోగులపై జాలి చూపని నిర్మలమ్మ.. పొగడ్తలు తప్ప ఒక్క రూపాయి లాభం లేదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News