Yashoda Teaser: గర్భవతిగా సమంత.. చేయోద్దన్న పనే చేయడంతో?

Yashoda Telugu Teaser Review: సమంత ప్రధాన పాత్రలో నటిస్తుండగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్న యశోద టీజర్ రిలీజ్ అయింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 9, 2022, 11:14 AM IST
Yashoda Teaser: గర్భవతిగా సమంత.. చేయోద్దన్న పనే చేయడంతో?

Yashoda Telugu Teaser Review: నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత అనేక సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అలా ఆమె చేస్తున్న సినిమాలలో యశోద సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుండగా మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో హరీష్ నారాయణ్, హరి శంకర్ అనే ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్నారు.

శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టీజర్ తాజాగా ఐదు భాషల్లో విడుదలైంది. ఈ టీజర్ను సమంత తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఐదు భాషలకు చెందిన లింక్స్ ను ఆమె షేర్ చేసింది. ఈ టీజర్ అభ్యంతరం ఆసక్తికరంగా సాగింది. టీజర్ ను బట్టి సమంత పేరు యశోదగా తెలుస్తుండగా ఆమె ప్రెగ్నెంట్ అనే విషయాన్ని డాక్టర్ కన్ఫర్మ్ చేస్తుంది.

అలా కన్ఫర్మ్ చేసుకుని తర్వాత ఏ పనులైతే చేయొద్దని ఆమెకు డాక్టర్ చెబుతుందో ఆయా పనులే సమంత చేస్తున్నట్లు చూపించారు. ఆమెను ఏదో ఒక రహస్య ప్రదేశంలో బంధించి ఆమె మీద ఏదో ప్రయోగాలు చేస్తున్నట్లు టీజర్ ను అనిపిస్తుంది. బహుశా మెడికల్ మాఫియా కి సంబంధించిన సబ్జెక్టు ఏదైనా అయి ఉండవచ్చని టీజర్ను చూస్తే అనిపిస్తోంది.

ఇక ఈ సినిమాలోరావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తెలుగు సినీ జర్నలిస్టులు పులగం చిన్నారాయణ, డాక్టర్ భాగ్యలక్ష్మి ఈ సినిమాకి డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమా మీద టీజర్ ఒక్కసారిగా సినిమా ఆసక్తి రేకెత్తించింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.

Also Read: SJ Surya in RC15 : రామ్ చరణ్ సినిమాలో ఎస్జే సూర్య.. ఆ పాత్ర కోసమేనా?

Also Read: Amit Shah meetin Celebs: నిఖిల్ తో భేటీ కానున్న అమిత్ షా.. రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News