Writer Bala Murugan Passed Away: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది. తెలుగు సహా తమిళంలో అనేక సినిమాలకు రచయితగా వ్యవహరించిన తమిళ కథా రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. ఆయన వయసు ప్రస్తుతం 86 సంవత్సరాలు. గత కొన్నాళ్లుగా వయోభారం అనారోగ్యంతో రీత్యా ఇబ్బంది పడుతున్న ఆయన ఈ ఉదయం 8:45 నిమిషాలకు కన్నుమూసినట్లు ఆయన కుమారుడు, తెలుగు-తమిళ సినీ రచయిత భూపతి రాజా మీడియాకు వెల్లడించారు.
తెలుగులో బాలమురుగన్ ధర్మదాత, ఆలుమగలు, సోగ్గాడు, సావాసగాళ్లు, జీవన తరంగాలు వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కధ అందించారు. ఇక వీటిలో శోభన్ బాబు హీరోగా జరిగే ఎక్కిన సోగ్గాడు సినిమా ఎంత భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తమిళంలో స్టార్ హీరోగా ఒకప్పుడు చక్రం తిప్పిన శివాజీ గణేషన్ కి దాదాపు 30 నుంచి 40 సినిమాలకు బాలమురుగన్ కథలు అందించారు. బాలమురుగన్ మృతి చెందారు అన్న విషయం తెలుసుకున్న తమిళ, తెలుగు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇక భూపతి రాజా కూడా తెలుగులో అనేక సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ముఠామేస్త్రి సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భూపతి రాజా తర్వాత చూడాలని ఉంది, హిట్లర్, అన్నయ్య, ఇద్దరు మిత్రులు, డాడీ, అందరివాడు వంటి సినిమాలకు కధ అందించారు. ఇక జగపతిబాబు, ఆమని జంటగా నటించిన శుభలగ్నం సినిమా కూడా ఆయన కథ నుంచి పుట్టిందే. పెళ్లి చేసుకుందాం, ప్రేమతో రా, గోపాల గోపాల వంటి సినిమాలతో దగ్గుబాటి వెంకటేష్ కు హిట్ లు అందించిన భూపతి రాజా నాగార్జునతో ఆటో డ్రైవర్, నేను ఉన్నాను వంటి సినిమాలకు కూడా కథలు అందించారు.
బాలకృష్ణ చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి, పవన్ కళ్యాణ్ చేసిన కాటమరాయుడు వంటి సినిమాలకు కూడా ఆయన పని చేశారు. శ్రీవాస్ దర్శకత్వంలో ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న మూడో సినిమా రామబాణం సినిమాకి కూడా భూపతి రాజా కథా అందిస్తుండటం గమనార్హం. తాజా దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ లాంచ్ కూడా ఇటీవల జరిగింది. ఈ లోపు ఆయన తన తండ్రిని కోల్పోవడం బాధాకరమైన విషయం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook