RRR: ఇండియన్ సినీ హిస్టరీలో 'ఆర్ఆర్ఆర్' సంచలనం కాబోతుందా.. వసూళ్ల పరంగా పాత రికార్డులన్నీ బద్దలవుతాయా..

Expectations over RRR Collections: . ఇప్పటికే వెయ్యి కోట్ల ప్రీ బిజినెస్ జరిగినట్లుగా చెబుతున్న ఈ సినిమా... విడుదల తర్వాత ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తుందని అంచనా వేస్తున్నారు. రూ.3 వేల కోట్లు వసూలు చేయడం పక్కా అని చెబుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 21, 2022, 04:01 PM IST
  • ఆర్ఆర్ఆర్‌పై భారీ అంచనాలు
  • వసూళ్ల పరంగా కొత్త రికార్డులు సెట్ చేసే ఛాన్స్
  • రూ.3వేల కోట్లు వసూలు చేయొచ్చునని అంచనాలు
RRR: ఇండియన్ సినీ హిస్టరీలో 'ఆర్ఆర్ఆర్' సంచలనం కాబోతుందా.. వసూళ్ల పరంగా పాత రికార్డులన్నీ బద్దలవుతాయా..

Expectations over RRR Collections: 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నకొద్ది అభిమానుల్లో ఆత్రుత అంతకంతకూ పెరుగుతోంది. జక్కన్న చిత్రాన్ని ఎప్పుడెప్పుడూ వెండి తెరపై చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వెయ్యి కోట్ల ప్రీ బిజినెస్ జరిగినట్లుగా చెబుతున్న ఈ సినిమా... విడుదల తర్వాత ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాస్తుందని అంచనా వేస్తున్నారు. రూ.3 వేల కోట్లు వసూలు చేయడం పక్కా అని చెబుతున్నారు. ఇంతలా సినిమాపై అంచనాలు పెంచేసిన అంశాలు.. వసూళ్లపరంగా కలిసొచ్చే అంశాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

ఆర్ఆర్ఆర్‌కు వసూళ్లపరంగా కలిసొచ్చే అంశాలు : 

రాజమౌళి.. ఈ పేరంటే ఒక బ్రాండ్.. ఆయన తెరకెక్కించిన సినిమా ఏదీ ఇప్పటివరకూ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడలేదు. ప్రేక్షకుడి నాడి తెలిసిన దర్శకుల్లో ఆయన ముందు వరుసలో ఉంటారు. అందుకే జక్కన్న చెక్కిన చిత్రాలన్నీ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. బాహుబలి సినిమాతో ఆయన ఇమేజ్ హాలీవుడ్ దాకా వెళ్లింది. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో.. ఆర్ఆర్ఆర్ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వసూళ్లపరంగా ఇది ఆర్ఆర్ఆర్‌కు బాగా కలిసొచ్చే అంశం.

ఇప్పటివరకూ రాజమౌళి సోలో హీరోలతోనే సినిమాలు తెరకెక్కించారు. తొలిసారి ఇద్దరు స్టార్ హీరోలతో.. అదీ మన్యం వీరుల పాత్రలతో రాజమౌళి పెద్ద ప్రయోగమే చేశారు. మన్యం వీరులుగా అల్లూరి సీతారామరాజు, కుమ్రం భీమ్‌లకు ఉన్న ఆదరణ... ఆ పాత్రల్లో ఇద్దరు స్టార్ హీరోలు నటించడం సినిమాపై అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లింది. 

ఆర్ఆర్ఆర్‌లో బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, అజయ్ దేవగణ్, హాలీవుడ్ నటీనటులు ఒలివియా మోరిస్, రే స్టీవ్‌సన్, అలిసన్ డూడీ నటించడంతో.. బాలీవుడ్, హాలీవుడ్‌ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా రీచ్ అవనుంది.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాలు ప్రేక్షకులకు విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా వెండితెరపై డైనమైట్‌లా పేలడం ఖాయమంటున్నారు.

తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టికెట్ రేట్ల పెంపుకు అనుమతినివ్వడం... ఐదో షోకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఆర్ఆర్ఆర్ భారీ వసూళ్లు రాబట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. 

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే రూ.500 కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1810 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటివరకూ ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం అమీర్ ఖాన్ 'దంగల్'. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.2వేల పైచిలుకు కోట్లు కొల్లగొట్టింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఈ రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. 

Also Read: China Flight Crash: చైనా విమాన ప్రమాదంలో ఎవరూ బతకలేదా..కొండపై చెలరేగుతున్న మంటలు

Also read: China Plane Crash: బ్రేకింగ్ న్యూస్.. చైనా ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికులు మృతి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News