కోలీవుడ్ ( Kollywood ) తమిళనాట విజయ్ సేతుపతి ( Vijay Sethupati ) మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు.విజయ్ నటిస్తున్న తుగ్లక్ దర్బార్ ( Tughlaq Darbar ) సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు ఆ కీలక హీరోయిన్ ప్రకటించింది. ఆ హీరోయిన్ తప్పుకోడానికి కారణమేంటంటే..
కరోనా వైరస్ ( Corona virus ) కారణంగా అన్ని భాషల సినిమాలు నిలిచిపోయాయి. మొత్తం చలన చిత్ర పరిశ్రమ 6-8 నెలలుగా స్థంబించిపోయింది. అన్ లాక్ 5 ( Unlock 5.0 ) లో అనుమతులు జారీ అవడంతో ఇప్పుడిప్పుడే షూటింగులు ప్రారంభమవుతున్నాయి. కోవిడ్ 19 ( Covid19 ) నిబంధనల మధ్య తక్కువ క్రూ సిబ్బందితో షూటింగులు జరుపుకుంటున్నారు. ఈ నేపధ్యంలో తమిళనాట ప్రముఖ నటుడు కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి నటిస్తున్న తుగ్లక్ దర్భార్ వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అదితిరావు హైదరీ ( Aditirao hydari ) తప్పుకోవడమే. ఆమెనే స్వయంగా ఈ విషయం వెల్లడించింది.
అదితీరావు హైదరి పాత్రకు ప్రత్యామ్నాయంగా రాశిఖన్నా ( Rasi Khanna ) ను ఎంపిక చేశారు. ఇంతకీ తానెందుకు తప్పుకున్నానో గౌరవంగా వెల్లడించింది అదితీ. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమ ( Indian film Industry ) తో సహా ప్రపంచం గత 6-8 నెలలుగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలు షూటింగ్స్ ను మొదలుపెట్టారు. పని లేక నటీనటులు ఎవ్వరూ వేచి ఉండకూడదని తాను కోరుకుంటున్నట్టు తెలిపింది. తాను ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానని.. అలాగే ప్రారంభించని ప్రాజెక్ట్ లు తనవల్ల ఆలస్యం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు అదితీరావు హైదరీ స్పష్టం చేసింది.
సెవెన్ స్క్రీన్ స్టూడియోకు చెందిన లలిత్ కుమార్ నిర్మాతగా..విజయ్ సేతుపతి హీరోగా, ఢిల్లీ ప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న తుగ్లక్ దర్బార్ ప్రాజెక్టుపై అందరి దృష్టీ నెలకొంది. సినిమా నుంచి తప్పుకున్న అదితీరావు...మొత్తం యూనిట్ కు మంచి జరగాలని కోరుకుంది. అందరూ బాగుండాలని..తాను చేయాల్సిన పాత్రను చేస్తున్న రాశి ఖన్నాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ అందరూ సురక్షితంగా జాగ్రత్తగా ఉండాలంటూ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది అదితీరావు హైదరి. Also read: Sanjay Dutt: కేన్సర్ నుంచి కోలుకున్న సంజయ్ దత్