Movies Releasing This Week: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలివే!

Movies Releasing This Week: కరోనా కారణంగా గతేడాది మూసుకుపోయిన థియేటర్లు ఈ ఏడాది మార్చి నుంచి పూర్తి స్థాయిలో తెరచుకున్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం వరుస భారీ బడ్జెట్ చిత్రాలు విడుదలవుతున్నాయి. అయితే ఈ వారం థియేటర్, ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలేవో తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2022, 12:08 PM IST
Movies Releasing This Week: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలివే!

Movies Releasing This Week: కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా సినిమా థియేటర్లు రీఓపెన్ అయ్యాయి. దీంతో ఈ ఏడాది 'భీమ్లా నాయక్' సినిమాతో ప్రారంభమైన బాక్సాఫీస్ దండయాత్ర ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. ఏప్రిల్ లో 'బీస్ట్', 'కేజీఎఫ్ 2' సినిమా విడుదల తర్వాత ఇప్పుడు మరికొన్ని చిత్రాలు ఈ వారం థియేటర్/ఓటీటీల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కానున్న చిత్రాలేవో తెలుసుకుందాం. 

జెర్సీ (హిందీ)

నేచురల్ స్టార్ నాని ప్రధానపాత్రలో నటించిన 'జెర్సీ' చిత్రానికి ఇప్పుడు హిందీ రీమేక్ తెరకెక్కింది. షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీని అదే టైటిల్ తో బాలీవుడ్ లో విడుదలకు సిద్ధమైంది. తెలుగులో డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం (ఏప్రిల్ 22) థియేటర్లలో విడుదల కానుంది. 

1996 ధర్మపురి

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ సమర్పణలో ఓ చిత్రం రూపొందింది. అందులో హీరోహీరోయిన్లుగా గగన్ విహారి, అపర్ణ నటించిన చిత్రం '1996 ధర్మపురి'. డైరెక్టర్ విశ్వజగన్ రూపొందించిన ఈ చిత్రాన్ని భాస్కర్ యాదవ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ కూడా ఏప్రిల్ 22న రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. 

ఓటీటీల్లో విడుదల కానున్న చిత్రాలు..

జీ 5 ఓటీటీ

అనంతం (తెలుగు) - ఏప్రిల్‌ 22

ఆహా ఓటీటీ

వరుణ్ తేజ్ 'గని' - ఏప్రిల్‌ 22

అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీ

ఓ మై డాగ్‌ (తమిళం, తెలుగు) - ఏప్రిల్‌ 21

గిల్టీ మైండ్స్‌ (హిందీ)  - ఏప్రిల్‌ 22 

Also Read: Gangubai Kathiawadi: ఆలియాభట్‌ గంగూబాయి వచ్చేస్తోంది.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Also Read: Rakul Preet Singh: టాలీవుడ్ స్లిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్‌సింగ్ ఇంకా స్లిమ్ అయిపోయిందా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News