Web Series on Pv Narasimharao: పీవి వెబ్‌‌సిరీస్‌లో బాబ్రీ మసీదు, హర్షద్ మెహతా స్కాం దృశ్యాలుంటాయా

Web Series on Pv Narasimharao: దేశానికి తొలి తెలుగు ప్రధాని, బహు భాషాకోవిదుడు పీవి నరసింహారావు. దేశ రూపురేఖల్ని మార్చిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడాయనపై వెబ్‌సిరీస్ నిర్మితం కానుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 14, 2021, 12:15 PM IST
Web Series on Pv Narasimharao: పీవి వెబ్‌‌సిరీస్‌లో బాబ్రీ మసీదు, హర్షద్ మెహతా స్కాం దృశ్యాలుంటాయా

Web Series on Pv Narasimharao: దేశానికి తొలి తెలుగు ప్రధాని, బహు భాషాకోవిదుడు పీవి నరసింహారావు. దేశ రూపురేఖల్ని మార్చిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడాయనపై వెబ్‌సిరీస్ నిర్మితం కానుంది.

దేశంలో ఆర్ధిక సంస్కరణల్ని ప్రవేశపెట్టిన ప్రధానిగా, తొలి తెలుగు ప్రధానమంత్రిగా పేరు సంపాదించుకున్న వ్యక్తి  పీవీ నరసింహారావు. బహు భాషాకోవిదుడిగా పేరున్న పీవీ భారతదేశ రూపురేఖల్ని మార్చారు. ఆయన ప్రవేశపెట్టిన ఆర్ధిక సంస్కరణల ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయి. సరళీకృత ఆర్ధిక విధానాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి..దేశాన్ని వాణిజ్యపరంగా ముందుకు వెళ్లేట్టు చేశారు. 

పీవీ నరసింహారావు(PV Narasimharao)పనితీరుపై ప్రముఖ రచయిత వినయ్ సీతాపతి హాఫ్ లయన్ పుస్తకాన్ని రాశారు. ఇప్పుడీ పుస్తకం ఆధారంగా వెబ్‌సిరీస్ రూపొందించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ప్రకాష్ ఝా దర్శకత్వం వహిస్తుండగా, ఆహా స్టూడియోస్, అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. 2023లో వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ జరగనుంది.ఈ చిత్రాన్ని హిందీ , తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. 1991 నుంచి 1996 వరకూ దేశ ప్రధానిగా చేసిన పీవీ నరసింహారావుపై వెబ్‌సిరీస్(Web Series)అంటే చాలా రకాల అంశాల ప్రస్తావనకు వస్తాయా లేవా అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే పీవీ నరసింహారావు హయాంలోనే బాబ్రీ మసీదు కూల్చివేత, హర్షద్ మెహతా స్కామ్ వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపధ్యంలో అల్లు అరవింద్ నిర్మిస్తున్న వెబ్‌సిరీస్‌లో ఈ అంశాలు ఉంటాయా లేదా కేవలం ప్రధానిగా ఆయన పనితీరుపైనే ఉంటుందా అనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది. 

Also read: BiggBoss 5 Telugu Grand Finale:బిగ్‌బాస్ తెలుగు 5 గ్రాండ్ ఫినాలే అతిధులు ఎవరో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News