Nani about senior heroes : టాలీవుడ్ లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకొని.. ఎంతమంది యువ హీరోలు వచ్చిన.. ఇంకా తమ హవా కొనసాగిస్తున్నారు సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్. ఈ ముగ్గురు హీరోలు ఎవరికి వారు సాటి. చిరంజీవికి, బాలకృష్ణకి మాస్ ఫాన్స్ ఉండగా.. వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన అభిమానులు ఉన్నారు.
అంతమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముగ్గురు హీరోలు ఒకేసారి కనిపిస్తే.. ఇక తెలుగు అభిమానుల ఆనందం ఎలా ఉంటుందో అంచనాలు వెయ్యడం కష్టమే. అయితే అలాంటి అరుదైన దృశ్యమే ఐఫా 2024 లో జరిగింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కలిపి ఒకేసారి స్టేజిపై కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తెగ ఆకట్టుకుంటోంది.
Nani Speech At #IIFA2024 pic.twitter.com/elq4qCVbMa
— Nanii!! DevaRAW (@narasimha_chow2) September 28, 2024
ఇక ఈ ఐఫా అవార్డుల్లో నానికి అవార్డు రాగా.. స్టేజ్ పైన మాట్లాడుతూ ఈ ముగ్గురు సీనియర్ హీరోలని తెగ పొగిడేసారు నాని. చిరంజీవికి గిన్నిస్ రికార్డు వచ్చినందుకు కంగ్రాట్యులేషన్స్ చెప్పిన నాని.. ఆ తరువాత బాలయ్య బాబు 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుకు.. అందుకుగాను ఐఫాలో లెగసి అవార్డు అందుకున్నందుకు.. ఇంకా పెద్ద కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. ఇక వెంకటేష్ కి ఎన్నో కంగ్రాట్యులేషన్స్ చెప్పాలి అని.. ఆయన ఎంతో పాజిటివ్ గా ఇన్ని సంవత్సరాలు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు.. ఆయన అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Indian Cinema Award at the 24th IIFA Festival at Etihad Arena, Abu Dhabi
Chiranjeevi, Balakrishna & Venkatesh ♥️👏 pic.twitter.com/kdkR3K7drL
— Telugu360 (@Telugu360) September 28, 2024
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభరా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. బింబిసారా అలాంటి బ్లాక్ బస్టర్ సినిమా అందించిన మల్లాడి వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోపక్క బాలకృష్ణ.. చిరంజీవికి వాల్తేరువీరయ్య లాంటి సూపర్ హిట్ ఇచ్చిన బాబీతో తన తదుపరిచిత్రం చేస్తున్నారు. కాగా వెంకటేష్ అనిల్ రావిపూడిలో సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం షూటింగ్తో బిజీగా ఉన్నారు.
Read more: Hydra Victims: నీ అయ్య జాగీరా ఎవడ్రా నువ్వు మా ఇల్లు కూలగొట్టేది.. హైడ్రా వర్సెస్ మూసీ బాధితులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.