Waltair Veerayya Day 6: ఆరు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసిన వీరయ్య.. ఎన్ని కోట్ల లాభమంటే?

Waltair Veerayya Day 6 Worldwide Collections: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి-మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి రిలీజ్ అవగా ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసింది. ఆ వివరాల్లోకి వెళితే  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 19, 2023, 01:15 PM IST
Waltair Veerayya Day 6: ఆరు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసిన వీరయ్య.. ఎన్ని కోట్ల లాభమంటే?

Waltair Veerayya 6 Days Worldwide Collections: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి-మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పటికే విడుదలై దాదాపుగా ఆరు రోజుల పూర్తి థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ నేపద్యంలో మొదటి ఆరు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఎంత రాబట్టింది అనే విషయం పరిశీలిద్దాం.

మొదటి రోజు 22 కోట్ల 90 లక్షలు,  రెండో రోజు 11 కోట్ల 95 లక్షలు,  మూడవరోజు 12 కోట్ల 61 లక్షలు,  నాలుగో రోజు 11 కోట్ల 42 లక్షలు,  ఐదో రోజు 8 కోట్ల 80 లక్షలు,  ఆరవ రోజు ఏడు కోట్ల 33 లక్షలు మొత్తం కలిపి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పటివరకు 75 కోట్ల 1 లక్ష షేర్ 121 కోట్ల 35 లక్షల గ్రాస్ వసూలు చేసింది.

ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఆరవ రోజు వసూళ్లు ఏరియాల వారీగా పరిశీలిస్తే నైజాంలో రెండు కోట్ల ఒక లక్ష,  సీడెడ్ లో కోటి పది లక్షలు,  ఉత్తరాంధ్రలో కోటి 50 లక్షలు,  ఈస్ట్ గోదావరిలో 91 లక్షలు,  వెస్ట్ గోదావరిలో 44 లక్లు,  గుంటూరులో 50 లక్షలు,  కృష్ణ 60 లక్షలు,  నెల్లూరు 27 లక్షలు వెరసి 11 కోట్ల 65 లక్షల గ్రాస్ వసూలు రాబట్టింది.

ఇక ఆరు రోజులకు కలిపి కర్ణాటక సహా మిగతా భారతదేశంలో 5 కోట్ల 90 లక్షలు వసూలు చేస్తే ఓవర్సీస్ లో మాత్రమే 10 కోట్ల 50 లక్షలు వసూలు చేసింది. అలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఆరు రోజులకు గాను 91 కోట్ల 41 లక్షలు వసూలు చేయగా 157 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 88 కోట్లకు జరగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 89 కోట్లు అని నిర్ణయించారు. బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న సినిమా రెండు కోట్ల 41 లక్షల లాభాలతో దూసుకుపోతోంది.

Also Read: Re Releases from Tollywood: తొలిప్రేమ, సింహాద్రి సహా రీ రిలీజ్ కాబోతున్న సినిమాలు ఇవే!

Also Read: Modi on Pathaan Controversy: సినిమాలపై అనవసర కామెంట్లు చేయొద్దు.. 'పఠాన్' వివాదంపై మోడీ కీలక వ్యాఖ్యలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News