ఇంటిలిజెంట్ ఎఫెక్ట్: సగం పారితోషికం తిరిగివ్వనున్న వివి వినాయక్ ?

'ఇంటిలిజెంట్'తో నష్టపోయిన వారిని ఆదుకునే పనిలో పడిన డైరెక్టర్ వినాయక్ 

Last Updated : Feb 15, 2018, 04:07 PM IST
ఇంటిలిజెంట్ ఎఫెక్ట్: సగం పారితోషికం తిరిగివ్వనున్న వివి వినాయక్ ?

దర్శకుడు వి.వి. వినాయక్ మరోసారి ఇబ్బందుల్లో పడ్డాడు. వినాయక్ తాజా చిత్రం ఇంటిలిజెంట్ ఈ ఏడాదిలోనే మొదటి డిజాష్టర్ గా మిగిలిపోయిందనే టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 85 శాతం నష్టాలు చవిచూసిన సినిమాను లాభాల బాట పట్టించడం సంగతి అటుంచితే, కనీసం నష్టాల నుంచి ఎలా గట్టెక్కలో అర్థం కాక జుట్టుపీక్కుంటున్న మేకర్స్ పై తాజాగా డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ దగ్గరి నుంచి ఒత్తిడి అధికమైనట్టు తెలుస్తోంది. 

తనని నమ్ముకుని సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు నష్టం చేయని దర్శకుడిగా పేరున్న వినాయక్ వెంటనే వారి కోరిక మేరకు తన పారితోషికంలోంచి సగం మొత్తాన్ని డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్స్ కి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకు హీరోగా సాయిధరమ్ తేజ్ తీసుకున్న పారితోషికానికన్నా దర్శకుడిగా వినాయక్ తీసుకున్న మొత్తం రెండింతలు. అందులో సగం నష్టపరిహారం కింద చెల్లించేందుకు వినాయక్ సిద్ధపడినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 

వివి వినాయక్ ఇలా కొంత పారితోషికాన్ని తిరిగి ఇవ్వడం ఇదేం మొదటిసారి కాదు.. గతంలో అఖిల్ సినిమా డిజాష్టర్ అయిన సందర్భంలోనూ వినాయక్ తన పారితోషికాన్ని తిరిగిఇచ్చినట్టు టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరిగింది. సి కళ్యాణ్ నిర్మించిన ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన లావణ్యా త్రిపాఠి జంటగా నటించింది. 

Trending News