VJ Jayathi : దుమ్ములేపిన నాటి వీజే జయతి.. ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ అంటూ సందడి

Vennela Programme Anchor ఒకప్పుడు జెమినీ టీవీలో ఉదయం పూట వెన్నెల ప్రోగ్రాం వచ్చేది. అందులో యాంకర్‌గా జయతికి మంచి ఫాలోయింగ్ ఉండేది. కాలర్స్‌తో ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అభిమానులను సొంతం చేసుకుంది జయతి. చాలా గ్యాప్ తరువాత జయతి ఓ ప్రైవేట్ ఆల్బమ్‌తో పలకరించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2023, 03:34 PM IST
VJ Jayathi : దుమ్ములేపిన నాటి వీజే జయతి.. ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ అంటూ సందడి

Na Friendhemo Pelli Music Album ఇప్పుడు ప్రైవేట్ ఆల్బమ్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. అందరూ ఈ ప్రైవేట్ ఆల్బమ్స్, ఫోక్ సాంగ్స్, ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద ఫోకస్ పెడుతున్నారు. ఓ చిన్న సినిమాకు ఎంత అయితే బడ్జెట్ పెడతారో.. అంత బడ్జెట్‌తో ఒక పాటను గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో నివృతి వైబ్స్ చాలా ముందుంది. అత్యుత్త‌మ‌మైన ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్‌తో ఆడియో, విజువ‌ల్ కంటెంట్‌ను అందించ‌టంలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు తానే బెస్ట్ అనిపించుకుంటోంది నివృతి వైబ్స్. ఇప్పుడు ఈ సంస్థకు ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో ప్ర‌త్యేక‌మైన స్థానం ఏర్పడింది. 

నివృతి వైబ్స్ నుంచి రీసెంట్‌గా వచ్చిన గంగులు, జరీ జరీ పంచెకట్టి పాటలు ఎంతగా ట్రెండ్ అయ్యాయో అందరికీ తెలిసిందే. గ‌డిచిన రెండేళ్ల‌లో తెలుగు, హిందీ, త‌మిళ్‌, క‌న్న‌డ భాష‌ల్లో నివృతి సంస్థ 50కి పైగా మ్యూజిక్ వీడియో సాంగ్స్‌ను అందించింది నివృతి వైబ్స్. సిల‌క ముక్కుదానా, జంజీరే, వ‌ద్ద‌న్నా గుండెల్లో సేరి వంటి పాట‌లు కూడా బాగానే వైరల్ అయ్యాయి.

ఇప్పుడు నివృతి వైబ్స్ నుంచి మ‌రో తెలంగాణ జాన‌ప‌ద పాటను రిలీజ్ చేశారు. ఒకప్పుడు బుల్లి తెరపై వెన్నెల ప్రోగ్రామ్‌తో తిరుగులేని క్రేజ్‌, ఇమేజ్‌ను ద‌క్కించుకున్న జ‌య‌తి మళ్లీ కొత్తగా కనిపించింది. ‘నా ఫ్రెండ్‌దేమో పెళ్లి..’ అంటూ సాగే ఈ పాటలో జయతి ప్రధానంగా కనిపించింది. ఈ సాంగ్‌లో అద్భుత‌మైన ఎక్స్‌ప్రెషన్స్, డ్యాన్స్ మూమెంట్స్‌తో ఆకట్టుకుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News