Gangs of Godavari: రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలోకి... విశ్వక్ కి మరోసారి తప్పని అపజయం!

Gangs of Godavari OTT: విశ్వ‌క్‌సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలైన 15 రోజులకే..ఓటీటీలోకి వచ్చేస్తోంది. సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చిన.. ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్స్ కి వెళ్లి చూసి ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో ఈ సినిమా అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 9, 2024, 11:38 AM IST
Gangs of Godavari: రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలోకి... విశ్వక్ కి మరోసారి తప్పని అపజయం!

Gangs of Godavari OTT:

విశ్వ‌క్‌సేన్ టైం ప్రస్తుతం అంతగా బాగా లేనట్టు ఉంది. సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తున్నా కానీ.. అవి థియేటర్స్ లో మాత్రం ఆడటం లేదు. మొన్నటికి మొన్న వచ్చిన గామి సినిమా విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. గామి సినిమా చాలా బాగుంది అంటూ.. రివ్యూల వచ్చాయి. కట్ చేస్తే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం హవా చూపించలేకపోయింది. అంతకుముందు వచ్చిన ‘దాస్ కా డామ్ కీ’ పరిస్థితి కూడా అంతే.. అందరూ సినిమా బాగుంది అని అన్నారు కానీ.. థియేటర్స్ కి వెళ్లి చూడలేదు.

దీంతో ఆశలన్నీ విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా పైన పెట్టుకున్నారు. నాగ వంశీ నిర్మాత కావడంతో.. అలానే బాలకృష్ణ ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి.. అటెండ్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది అనుకున్నారు అందరూ. ఇక విడుదలయ్యాక సినిమాకి రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. కానీ ఈ సినిమా విషయంలో కూడా విశ్వక్ కి గత సినిమాల‌ పరిస్థితే ఎదురయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రం హవా కొనసాగించకపోవడంతో..
గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి థియేట‌ర్ల‌లో రిలీజైన ప‌దిహేను రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. 

ఈ సినిమా చిత్రం రిలీజ్ డేట్‌ను ఆదివారం ఆఫీషియ‌ల్‌గా వెల్ల‌డించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 14న రిలీజ్ కాబోతోంది. తెలుగుతో పాటు ఈ చిత్రం త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌, హిందీ కూడా స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్ ప్ర‌క‌టించింది. ఇక ఇదే విషయాన్ని ప్రకటిస్తూ.. ఈ సినిమాకి సంబంధించిన ఓ పోస్ట‌ర్‌ను కూడా షేర్ చేశారు. అయితే థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు వారాల్లోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయ‌డం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ మధ్య కృష్ణమ్మ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. సినిమా బాగుంది అన్నా కానీ.. థియేటర్స్ లో మాత్రం ఎక్కువ రోజులు ఆడలేదు. దాంతో ఆ సినిమా కూడా వారానికి ఓటిటి స్త్రీమింగ్ మొదలుపెట్టింది. మొత్తానికి సినిమా టాక్ బాగున్న కాని.. ప్రేక్షకులను థియేటర్స్ కి పోయే ఇంట్రెస్ట్ చూపియాలంటే.. సినిమాలో తప్పకుండా మరింత కొత్తదనం ఉండాలని అర్థమవుతుంది.

కాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి సినిమాకి కృష్ణ చైత‌న్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. నేహా శెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో.. హీరోయిన్ అంజ‌లి ఓ కీల‌క పాత్ర పోషించింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ సినిమాను నిర్మించారు.

Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..

Read more; Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News