Love Guru: ప్రేక్షకులకు మలేషియా టూర్ ఆఫర్ ప్రకటించిన 'లవ్ గురు' మూవీ టీమ్.. ఆడియన్స్ చేయాల్సిందల్లా ఇదే..

Vijay Antony's Love Guru Family tour offer: ఆలోచించిన ఆశా భంగం.. మంచి తరుణం మించి పోతుంది. అవును విజయ్ ఆంటోని నటించిన 'లవ్ గురు' సినిమా యూనిట్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఫ్యామిలీ టూర్ ఆఫర్ ప్రకటించింది. వివరాల్లోకి వెళితే..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 14, 2024, 02:08 PM IST
Love Guru: ప్రేక్షకులకు మలేషియా టూర్ ఆఫర్ ప్రకటించిన 'లవ్ గురు' మూవీ టీమ్.. ఆడియన్స్ చేయాల్సిందల్లా ఇదే..

Vijay Antony's Love Guru Family tour offer: ఈ మధ్యకాలంలో సినిమాలు బాగున్నా.. ప్రేక్షకులు థియేటర్స్‌లో సినిమా చూడ్డాడానికి బద్దకిస్తున్నారు. ఒకవేళ సినిమా బాగున్నా.. ఓటీటీలో వస్తే చూద్దాం అనే టైపులోనే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో కొన్ని సినిమాలకు టాక్ బాగున్నా.. అందుకు తగ్గట్టు వసూళ్లను రాబట్టలేకపోతున్నాయి. మరోవైపు థియేటర్స్‌లో టికెట్ రేట్స్ కూడా ప్రేక్షకులను భయపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఆంటోని నటించిన 'లవ్ గురు' మూవీని మల్టీప్లెక్స్‌లో కేవలం రూ. 150 అమ్ముతున్నట్టు ప్రకటించారు. దీంతో ఈ సినిమా చూడడానికి ప్రేక్షకులు థియేటర్స్ వైపు అడుగులు వేస్తున్నారు.  మరోవైపు 'లవ్ గురు' మూవీకి పాజిటివ్ కూడా తోడైంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబడుతోంది. తాజాగా ఈ సినిమా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందకు మరో బంపరాఫర్ ప్రకటించింది. 'లవ్ గురు' సినిమా చూసే ప్రేక్షకుల్లో విజేతలను ఫ్యామిలీతో హాలీడే టూర్ తీసుకెళతామని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇందులో మొదటి ఫ్రైజ్ విన్నర్‌కు మలేషియా, రోండో ప్రైజ్ విన్నర్‌కు కశ్మీర్, మూడో ఫ్రైజ్ విజేతకు ఊటీ హాలీడే ట్రిప్ తీసుకెళ్తామని 'లవ్ గురు' టీమ్ తెలిపింది.  

నేటి నుంచి (14-4-2024) నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానుంది. 'లవ్ గురు' మూవీ చూసిన ప్రేక్షకులు వాళ్ల పేరు ..ఫోన్ నంబర్.. టికెట్ వివరాలు రాసి థియేటర్స్ దగ్గర ఏర్పాటు చేసిన బాక్సుల్లో వేయాలి. ఆన్‌లైన్ టికెట్ కొన్న ప్రేక్షకులు 9963466334 నంబర్‌కు మీ టికెట్ ఫోటోను వాట్సాప్ చేయాలి. ఈ సమ్మర్ హాలీడేస్ వెకేషన్ ను పూర్తి ఉచితంగా ఎంజాయ్ చేసే అవకాశం 'లవ్ గురు' సినిమా టీమ్ కల్పిస్తోంది. 'లవ్ గురు' మూవీ సినిమాను రంజాన్ పండగ సందర్భంగా ఈ నెల 11న విడుదల చేశారు. 'లవ్ గురు' సినిమాలోని సన్నివేశాలు ఎంటర్ టైన్ చేస్తూనే ఎమోషనల్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. తనను ద్వేషించే భార్యను ప్రేమతోనే గెలవాలని ప్రయత్నించే భర్త పాత్రలో విజయ్ ఆంటోనీ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.  లవ్ గురు సినిమాలో విజయ్ ఆంటోని సరసన మృణాళిని రవి కథానాయికగా నటించింది. విజయ్ ఆంటోనీ ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ సమర్పణలో విజయ్ ఆంటోనీ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించారు.

Read More: Sonu Sood: షూ చోరీ చేసిన స్విగ్గీ డెలీవరీ బాయ్ కు సోనూసూద్ అండ.. కొత్త బూట్లు కొనివ్వండంటూ ట్వీట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News