Bichagadu 2 Sneakpeak: ఒక్కదెబ్బకు సినిమా మీద అంచనాలు పెంచేసిన బిచ్చగాడు స్నీక్ పీక్ ట్రైలర్

Bichagadu 2 Sneakpeak : సూపర్​ హిట్ బిచ్చగాడు  సినిమాకు  సీక్వెల్​గా 'బిచ్చగాడు 2' తెరకెక్కిస్తున్నారు. విజయ్​ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో.. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన స్నీక్ పీక్ సినిమా మీద ఆసక్తి పెంచేస్తోంది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 10, 2023, 07:01 PM IST
Bichagadu 2 Sneakpeak: ఒక్కదెబ్బకు సినిమా మీద అంచనాలు పెంచేసిన బిచ్చగాడు స్నీక్ పీక్ ట్రైలర్

Bichagadu 2 Sneakpeak Trailer: బిచ్చగాడు సినిమాతో తెలుగులో కూడా విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్న విజయ్ ఆంటోని చేస్తున్న ప్రతి తమిళ సినిమాని ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. అయితే బిచ్చగాడు సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ సినిమాకు ఒక సీక్వెల్ తెరకెక్కిస్తామని ప్రకటించి ఆ మేరకు రంగంలోకి దిగారు విజయ్ ఆంటోనీ. ఆయనే స్వయంగా దర్శకత్వం వహిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాకి స్వరాలు కూడా ఆయనే సమకూరుస్తూ ఉండడం గమనార్హం.

ఇక విజయ్ భార్య ఫాతిమా అంటోనీ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి కావచ్చింది. ఇక ఒక పక్క సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతోంది. అయితే విజయ్ ఆంటోని తాజాగా యాక్సిడెంట్ బారిన పడటంతో ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ పక్కన పెట్టారు. ఇక  సూపర్​ హిట్ బిచ్చగాడు  సినిమాకు  సీక్వెల్​గా 'బిచ్చగాడు 2' తెరకెక్కిస్తున్నారు. విజయ్​ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో.. ఆయన హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సీక్వెల్‌ సినిమా వేసవిలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా సినిమా టీమ్ ప్రమోషన్స్ సరికొత్తగా ప్రారంభించింది. టీజర్‌, ట్రైలర్‌లకు భిన్నంగా.. 'స్నీక్‌ పీక్‌ ట్రైలర్‌' అంటూ సినిమా ఓపెనింగ్‌ సీన్ సుమారు నాలుగు నిముషాల క్లిప్ విడుదల చేసింది. ఈ స్నీక్‌ పీక్‌ ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగిందని చెప్పక తప్పదు. 'స్నీక్‌ పీక్‌ ట్రైలర్‌' చూస్తే ఎప్పుడూ ప్రయోగాలు చేయడంలో ముందు వరుసలో ఉండే విజయ్ ఆంటోనీ.

ఇప్పుడు మరో మెట్టు ఎక్కి ఈ సినిమాను మరో వినూత్న కాన్సెప్ట్​తో తెరకెక్కించారని అర్ధమవుతోంది. స్నీక్​పీక్​ ట్రైలర్ ను బట్టి.. 'బ్రెయిన్ ట్రాన్స్​ప్లాంట్​' ఆధారంగా రూపొందుతున్నట్లు కనిపిస్తుంది. కిడ్నీ, గుండె లాంటి అవయవాలను ట్రాన్స్​ప్లాంట్లు ఇప్పటికే జరుగుతున్నా బ్రెయిన్​ ట్రాన్స్​ప్లాంట్​ అనేది ప్రస్తుతం ప్రయోగాల దశలోనే ఉండగా అదే సినిమా మెయిన్ పాయింట్. చూడాలి మరి సినిమా ఎలా ఉండనుంది అనేది. 
Also Read: Vedha OTT release: నిన్న థియేటర్లో నేడు ఓటీటీలో 'వేద'.. ఎందులో స్ట్రీమ్ అవుతుందో తెలుసా?

Also Read: Amigos OTT : అమిగోస్ వచ్చేది ఆ ఓటీటీలోకే.. ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News