Samantha, Naga Chaitanya divorce: నాగచైతన్య, సమంత విడాకులను ఉద్దేశించే వెంకటేష్ ఆ పోస్ట్ పెట్టాడా ?

Venkatesh about Samantha, Naga Chaitanya divorce: ఇప్పటికే సమంత, చైతూల విడాకుల వివాదంపై అక్కినేని కుటుంబం తరపున నాగార్జున, సమంత కుటుంబం తరపున ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు (Samantha's father Joseph Prabhu) స్పందించారు. చైతూ మేనమామ వెంకీ కుటుంబం ఏమనుకుంటోందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 6, 2021, 01:51 PM IST
Samantha, Naga Chaitanya divorce: నాగచైతన్య, సమంత విడాకులను ఉద్దేశించే వెంకటేష్ ఆ పోస్ట్ పెట్టాడా ?

Venkatesh about Samantha, Naga Chaitanya divorce: నాగ చైతన్య, సమంతల విడాకుల వ్యవహారంపై ఫిలింనగర్‌లో సినీ ప్రముఖులు, సోషల్ మీడియాలో నెటిజెన్స్ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా చైతూ, సమంతల విడాకుల గురించే టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్లు అన్యోణ్యంగా కలిసిమెలిసి ఉన్న నాగ చైతన్య, సమంత దంపతులు ఉన్నట్టుండి ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుకున్న కారణం ఏంటి ? ఏ పరిస్థితుల్లో సమంత, చైతూ దంపతులు విడాకులు తీసుకోవాల్సి వచ్చింది అనే సందేహాలు సమంత, అక్కినేని అభిమానుల బుర్ర తొలిచేస్తున్నాయి.

ఇప్పటికే సమంత, చైతూల విడాకుల వివాదంపై అక్కినేని కుటుంబం తరపున నాగార్జున, సమంత కుటుంబం తరపున ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు (Samantha's father Joseph Prabhu) స్పందించారు. అయినప్పటికీ రకరకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇక చైతూ మేనమామ వెంకీ కుటుంబం ఏమనుకుంటోందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 

ముఖ్యంగా చైతూ తల్లి లక్ష్మి, నాగార్జునల విడాకులతోనే వెంకీ, సురేష్ బాబు అప్పట్లో బాగా డిస్టర్బ్ అయ్యారని, ఆ తర్వాత వాళ్లింట్లో వేడుకగా జరిగిన చైతూ, సమంతల పెళ్లి కూడా బ్రేకప్ అవడం వారిని ఇంకెంత ఇబ్బందికి గురిచేస్తుందోనని నెటిజెన్స్ చెవులు కొరుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వెంకటేశ్ (Venkatesh about Samantha, Naga Chaitanya divorce) ఇదే అంశంపై పరోక్షంగా స్పందించాడు. 

Also read : MAA Elecrtions 2021: ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు రవి బాబు

సాధారణంగా అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ అంత యాక్టివ్‌గా ఉండని వెంకటేష్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన స్టోరీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. నోరు తెరిచి మాట్లాడే ముందు కాస్త బుర్ర కూడా ఓపెన్ చేయాలి అంటూ వెంకీ పెట్టుకున్న ఇన్‌స్టా కొటేషన్‌పైనే ప్రస్తుతం అందరి దృష్టి పడింది. సమంత, నాగ చైతన్యల విడాకుల (Samantha, Naga Chaitanya divorce) గురించి జనం రకరకాలుగా చెప్పుకుంటుండం చూసి వారి నోర్లు మూయించడానికే వెంకటేష్ ఇలా ఇన్‌స్టా స్టోరీ పెట్టుకున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also read : Republic Movie Dispute in Kolleru : ఆ సన్నివేశాలు తొలగించకపోతే..కోర్టుకు వెళ్తాం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News