VSR vs WV Collections: 'వీర సింహా' కంటే వెనుకొచ్చి 34 కోట్ల ముందంజలో వీరయ్య!

  Veera Simha Reddy Vs Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ఈ సారి సంక్రాంతి రేసులో పోటీ పడిన క్రమంలో ఈ రెండు సినిమాల మధ్య కలెక్షన్స్ తేడా ఎంత ఉంది అనేది పరిశీలిద్దాం.  

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 22, 2023, 03:16 PM IST
VSR vs WV Collections: 'వీర సింహా' కంటే వెనుకొచ్చి 34 కోట్ల ముందంజలో వీరయ్య!

Veera Simha Reddy Collections Vs Waltair Veerayya Collections: సంక్రాంతి సందర్భంగా తెలుగులో బడా హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సంక్రాంతి బరిలో దిగి పోటీపడ్డారు. ముందుగా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి జనవరి 12వ తేదీ విడుదల కాగా జనవరి 13వ తేదీన మెగాస్టార్ చిరంజీవి రవితేజ హీరోలుగా నటించిన వాల్తేరు సినిమా రిలీజ్ అయింది.

ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం రెండు సినిమాల్లోనూ ఒకరే హీరోయిన్గా నటించడంతోపాటు రెండు సినిమాలను ఆ ఇద్దరు హీరోల అభిమానులైన గోపీచంద్ మలినేని, బాబీ తెరకెక్కించడంతో సినిమాల మీద అందరికీ ఆసక్తి ఏర్పడింది. దానికి తగినట్లుగానే రెండు సినిమాల నుంచి వస్తున్న అన్ని అప్డేట్స్ మీద ప్రేక్షకులు కంపారిజన్ మొదలుపెట్టడంతో ఈ రెండు సినిమాల వసూళ్లు ఎలా ఉన్నాయనే దానిపై ఒకసారి లుక్ చేసే ప్రయత్నం చేద్దాం.

ముందుగా రిలీజైన నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి ఇప్పటికే 10 రోజుల దియేట్రికల్ రన్ పూర్తి చేసుకోగా 10 రోజులలో తెలుగు రాష్ట్రాల్లో 61 కోట్ల 95 లక్షలు వసూలు చేస్తే 100 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈ సినిమా పది రోజులకు గాను కర్ణాటక సహా మిగతా భారత దేశంలో నాలుగు కోట్ల 64 లక్షలు, ఓవర్సీస్ లో ఐదు కోట్ల 65 లక్షలు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా 72 కోట్ల 24 లక్షల షేర్ 121 కోట్ల ఐదు లక్షల గ్రాస్ వసూలు చేసింది.

ఇక వాల్తేరు వీరయ్య తొమ్మిది రోజులు పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 88 కోట్ల 37 లక్షల షేర్, 142 కోట్ల 60 లక్షల గ్లాసు వసూళ్లు రాబడితే 8వ రోజు కంటే 9వ రోజు ఇంకా ఎక్కువ వసూళ్లు రాబట్టడం ఆసక్తికరంగా మారింది. వాల్తేరు వీరయ్య తొమ్మిది రోజులు పాటు కర్ణాటక సహా మిగతా భారతదేశం మొత్తం ఆరు కోట్ల 90 లక్షలు వసూలు చేస్తే ఓవర్సీస్ లో 11 కోట్ల 45 లక్షల వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 106 కోట్ల 72 లక్షల షేర్, 142 కోట్ల 75 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. అలా తొమ్మిది రోజుల్లో వాల్తేరు వీరయ్య 106 కోట్ల 72 లక్షల షేర్, 142 కోట్ల 75 లక్షలు గ్రాస్ వసూలు  చేయగా 10 రోజుల్లో వీర సింహారెడ్డి  72 కోట్ల 24 లక్షల షేర్ 121 కోట్ల ఐదు లక్షల గ్రాస్ వసూలు చేసింది. అంటే ఒక రకంగా ఒక రోజు తేడాతో రిలీజైన ఈ రెండు సినిమాల్లో వాల్తేరు వీరయ్య సినిమా 24 కోట్లతో ముందంజలో ఉంది. 
Also Read: Veera Simha Reddy Day 10: 'వీర సింహా రెడ్డి'కి చివరి వీకెండ్.. బ్రేక్ ఈవెన్ పరిస్థితి ఏంటంటే?

Also Read: Waltair Veerayya Day 9: జోరు తగ్గని 'వాల్తేరు వీరయ్య'.. ఎనిమిదో రోజు కంటే తొమ్మిదో రోజు పెరిగిన వసూళ్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News