Bigg Boss Vasanthi Buzz Interview : నీట్‌గా రెడీ అవ్వడం తప్పా ఆడిందేమీ లేదు.. వసంతి పరువుతీసిన యాంకర్ శివ

Bigg Boss Vasanthi Buzz Interview బిగ్ బాస్ ఇంటి నుంచి వసంతి బయటకు వచ్చింది. యాంకర్ శివ బజ్ ఇంటర్వ్యూలో తన స్టైల్లో ప్రశ్నలు సంధిస్తుంటే.. వసంతి అదిరిపోయేలా ఆన్సర్లు చెప్పింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2022, 12:14 PM IST
  • బయటకు వచ్చిన బిగ్ బాస్ బ్యూటీ
  • వసంతిని ఆడుకున్న యాంకర్ శివ
  • బిగ్ బాస్ షోకు అందుకే వచ్చానన్న వసంతి
Bigg Boss Vasanthi Buzz Interview : నీట్‌గా రెడీ అవ్వడం తప్పా ఆడిందేమీ లేదు.. వసంతి పరువుతీసిన యాంకర్ శివ

Bigg Boss Vasanthi Buzz Interview : బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన వసంతిని శివ ఆడేసుకున్నాడు. బజ్ ఇంటర్వ్యూలో నానా రకాలుగా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. వాటికి వసంతి సైతం దిమ్మతిరిగేలా సమాధానాలు ఇచ్చింది. అందంలో బుట్టబొమ్మ.. ఆటలో ఉత్త బొమ్మ అంటూ ఎంట్రీలోనే వసంతి పరువుతీశాడు యాంకర్ శివ. ఎలిమినేషన్ అయ్యావ్.. ఇంత కూడా బాధపడటం లేదు అని యాంకర్ శివ అంటే.. ఫేస్ మీద కనిపిస్తేనే బాధ అని కాదు.. లోపల కూడా ఉంటది అని వసంతి రిప్లై ఇచ్చింది. వసంతి ఆర్మీ, వసంతి ఫ్యాన్స్ అని ఇంత ఫ్యాన్ బేస్ రావడానికి మీరేం చేశారు అని యాంకర్ శివ అంటే.. అది మీరే చెప్పాలి.. నేను ఇప్పుడే బయటకు వచ్చాను అని అంటుంది. వసంతి మేకప్ వేసుకుని, నీట్‌గా రెడీ అవ్వడం తప్పా ఇంక గేం ఏమీ ఆడలేదు అని శివ అంటాడు. బిగ్ బాస్ ఇంటికి ఏమేం కావాలో అన్నీ చేశాను అని వసంతి చెబుతుంది.

నాకు బిగ్ బాస్ ఇంట్లో ఎవ్వరి సపోర్ట్ లేదు అని వసంతి.. ఎవరి సపోర్ట్ కావాలి.. లోపల ఎవరు సపోర్ట్‌తో ఆడుతున్నారు అని శివ అడుగుతాడు. శ్రీహాన్, సత్య కలిసి ఆడుతున్నారు అని వసంతి చెబుతుంది. ఇంట్లోకి వెళ్లేముందు చాలా అల్లరి చేస్తాను, ఎంటర్టైన్మెంట్ చేస్తాను అని అన్నావ్.. ఏం చేశావ్ నువ్.. ఏం ఎంటర్టైన్ చేశావ్.. అల్లరి చేశావ్ అని శివ అడిగేస్తాడు. ఏం చేయకపోతే జనాలకు నచ్చకపోతే ఇన్ని రోజులు ఉండేదాన్ని కాదు అని వసంతి అంటుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News