Singer MM Manasi : ఎవరికి ఎప్పుడు ఎలా క్రేజ్ వస్తుందో చెప్పలేం. సింగర్లకు ఒకప్పుడు అయితే అంత గుర్తింపు వచ్చేది కాదు. వారి గొంతు మాత్రమే జనాల వరకు వచ్చేది. వాళ్లు ఎలా ఉండేవారు.. అనేది తెలిసి వచ్చేది కాదు. వారు ఎప్పుడూ ఆఫ్ ది స్క్రీన్లోనే ఉంటారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. సింగర్లే ఎక్కువగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు. లిరికల్ వీడియోల్లో హంగామా చేస్తున్నారు. ఈ లిరికల్ వీడియో ద్వారానే మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్ ఫేమస్ అయింది.
ఊ అంటావా మామ అంటూ ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కు జనాలు పడిపోయారు. ఒక్క పాటతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అరబిత్ కుత్తు లిరికల్ వీడియోలను సింగర్ ఫేమస్ అయింది. అలా హీరోయిన్ల కంటే ఒక్కోసారి సింగర్లే హైలెట్ అవుతుంటారు. ఇప్పుడు అలాంటి ఓ ఘటనే జరిగింది. తాజాగా దళపతి విజయ్, రష్మిక కాంబోలో వారిసు నుంచి రంజితమే సాంగ్ వచ్చింది.
ఈ లిరికల్ వీడియోలో తమన్ తన గ్యాంగుతో కలిసి సందడి చేశాడు. ఈ పాటను దళపతి విజయ్, మానసి కలిసి పాడారు. ఇందులో విజయ్, రష్మికల స్టెప్పుల కంటే మానసి ప్రజెన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె డ్రెస్సింగ్, చీరకట్టు, యాటిట్యూడ్, పాట పాడే విధానం అన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి. రష్మిక కంటే మానసినే అందరూ చూస్తున్నారు. ఆమె కోసమే అందరూ సర్చ్ చేస్తున్నారు.
తమన్ కొట్టిన ఆ ట్యూన్ మీద, పాట మీద ఎంతగా ట్రోలింగ్ జరుగుతోందో అందరికీ తెలిసిందే. పక్కా తమిళ వాసన ఆ ట్యూన్లో కనిపిస్తోంది. మరి ఇలాంటి బీట్ తెలుగు వారు ఏ మేరకు అంగీకరిస్తారో చూడాలి. అసలు ఈ సినిమాను పక్కా తమిళ సినిమానే తీస్తోన్నట్టు దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన మాటలకు ఈ పాట ఉదాహరణగా నిలుస్తోంది. ఈ సినిమా తెలుగులో ఆడుతుందా? లేదా?అన్నది చూడాలి.
Also Read : Samantha Latest Pics : అడుగు ముందుకేసిన సమంత.. మొదటిసారిగా బయటకు వచ్చిన ఫోటోలు.. ఇలా మారిందేంటి?
Also Read : Bigg Boss 6 Nominations List : నామినేషన్స్ హీట్.. మారని శ్రీహాన్, సత్య.. ఈ సారి మూడేది ఎవరికి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook