దేవదాస్ సినిమాలో నాగ్ రొమాంటింక్ యాంగిల్

Last Updated : Aug 31, 2018, 08:25 PM IST
దేవదాస్ సినిమాలో నాగ్ రొమాంటింక్ యాంగిల్

దేవదాస్ సినిమాలో నాగ్ మళ్లీ తనలోని రొమాంటింక్ యాంగిల్ చూపించుకున్నాడు. మాస్, మన్మథుడు, కింగ్, బాస్ అని ఒక్కో సినిమాతో ఒక్కో పేరు సొంతం చేసుకుంటూ వెళ్తున్న నాగార్జున.. ఏ దశలోనూ తనలోని రొమాంటిక్ యాంగిల్‌ని చూపించుకోకుండా మాత్రం ఉండటం లేదు. తాజాగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నానితో కలిసి నటించిన దేవదాస్ సినిమాలోనూ రొమాంటిక్ సన్నివేశాలు, పాటల్లో ఏ మాత్రం రాజీపడలేదని తాజాగా విడుదలైన వారు వీరు లిరికల్ సాంగ్ వీడియో స్పష్టంచేస్తోంది. "వారు వీరు ఉన్నా అనే' లిరిక్స్‌తో మొదలై... 'పడుచు అందం పక్కనుంటే పడిపోదా పురుష జన్మ... అల్లా పడిపోకపోతే ఏం లోటో ఏమో కర్మ" అని సాగే ఈ పాటలో నాగ్‌లోని సోగ్గాడు తళుక్కుమన్నాడు.

Trending News