Urvashi Rautela : రిషభ్ పంత్ కోసం హాస్పిటల్‌కు.. ఊర్వశీ రౌటేలా పోస్ట్ వైరల్

Urvashi Rautela Went to Kokilaben Hospital బాలీవుడ్ నటి ఊర్వశీ రౌటేలా ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తన రహస్య ప్రియుడు రిషభ్ పంత్‌కు ప్రమాదం జరగడంతో.. ఊర్వశీ తల్లడిల్లిపోతోంది. పంత్ కోసం తెగ ప్రార్థనలు చేస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 12:12 PM IST
  • కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రిషభ్ పంత్
  • రిషభ్ పంత్ కోసం ఊర్వశీ రౌటేలా ప్రార్థనలు
  • హాస్పిటల్‌కు వెళ్లిన బాలీవుడ్ స్టార్ నటి
Urvashi Rautela : రిషభ్ పంత్ కోసం హాస్పిటల్‌కు.. ఊర్వశీ రౌటేలా పోస్ట్ వైరల్

Urvashi Rautela స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఇక రిషబ్ పంత్ ఊర్వశీ రౌటేలా రహస్య ప్రేమ గురించి మీడియా అంతా కోడై కూస్తోంది. సోషల్ మీడియాలో అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం గురించి ఎప్పుడూ చర్చలు నడుస్తూనే ఉంటాయి. పంత్‌కు కారు ప్రమాదం జరగడంతో ఊర్వశీ రౌటేలా ఎమోషనల్‌తో తమ బంధాన్ని బయటపెడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇంత వరకు ఊర్వశీ పెదవి విప్పలేదు. కానీ పంత్ కోసం తెగ ఆరాటపడుతోంది.

పంత్‌కు కారు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే.. ఊర్వశీ ప్రార్థనలు చేసింది. త్వరగా కోలుకోవాలని, క్షేమంగా ఉండాలని పంత్ పేరు పెట్టకుండా ట్వీట్ వేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి పంత్‌ గురించి పరోక్షంగా మాట్లాడేసినట్టు అయింది. పంత్‌ ఇప్పుడు కోకిలాబెన్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాడు. అయితే పంత్‌ ఆ ఆస్పత్రిలో ఉన్నాడని తెలిసి.. ఆ హాస్పిటల్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది.

హాస్పిటల్ ఫోటోలను ఊర్వశీ రౌటేలా షేర్ చేసింది. హాస్పిటల్‌కు వెళ్లి పంత్‌ను ఊర్వశీ చూసిందని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. కానీ ఈ ఫోటోలను మాత్రం నటి బయట పెట్టలేదు. ఇంకా తమ బంధాన్ని ఇలా గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారనేది మాత్రం క్లారిటీగా తెలియడం లేదు. అయితే ఇలా ఊర్వశీ చేసిన పోస్ట్ మీద నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

ఇది కావాలనే ఆమె చేస్తోందని, పబ్లిసిటీ స్టంట్ అని కౌంటర్లు వేస్తున్నారు. శస్త్రచికిత్స తరువాత పంత్‌ను డెహ్రాడూన్‌ నుంచి ముంబైకి బుధవారం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 30న రిషబ్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఢిల్లీ నుంచి రూర్కీకి బయల్దేరగా..హమ్దాపూర్ ఝల్ సమీపంలో ఆయన కారు డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది.

Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News