Urvashi Rautela Praying: ఊర్వశి రౌతేలా ప్రార్ధనలు రిషబ్ పంత్ కోసమేనా.. లేక?

Urvashi Rautela Praying: ఊర్వశి రౌతేలా తాను ప్రార్ధన  చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఆమె ప్రార్ధనలు చేస్తున్నది రిషబ్ పంత్ కోసమేనా.. లేక ఇంకెవరి కోసమైనానా ? అంటూ కొత్త చర్చ జరుగుతోంది. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 30, 2022, 03:22 PM IST
Urvashi Rautela Praying: ఊర్వశి రౌతేలా ప్రార్ధనలు రిషబ్ పంత్ కోసమేనా.. లేక?

Urvashi Rautela Indirect Post on Rishabh Pant Accident: ఇండియన్ క్రికెట్ టీంలో మెరిక లాంటి ఒక క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్లోని రూర్కి సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. అయితే ఈ నేపథ్యంలో ఆయన కోలుకోవాలని అనేక మంది కామెంట్లు పెడుతున్నారు. అనేకమంది ఆయనకు మద్దతుగా నిలుస్తూ పోస్టులు పెడుతున్నారు.

అయితే ఆయనతో ఒకప్పుడు ప్రేమలో ఉండి తర్వాత బ్రేకప్ చెప్పినట్టు ప్రచారం జరుగుతున్న ఊర్వశి రౌతేలా కూడా ఆయన గురించి ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. రిషబ్ పంత్ ప్రమాదానికి గురైన ఈరో జే ఆమె తాను ప్రార్థిస్తున్నాను అంటూ ఒక పోస్ట్ పెట్టింది. అయితే ఆమె ఎందుకు ప్రార్థిస్తున్నా? అనే విషయం మీద ఎలాంటి కామెంట్ చేయలేదు కానీ ఆమె రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తుంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

రిషబ్ పంత్ ప్రయాణిస్తున్న కారు అతివేగంతో వచ్చి డివైడర్ ని ఢీ కొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో తీవ్ర గాయాల పాలయ్యాడు రిషబ్ పంత్. వెంటనే ఆయనని సమీపంలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించి తర్వాత మెరుగైన చికిత్స కోసం ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ కి తరలించారు. ఇక వైద్యుల నివేదికల ప్రకారం పంత్ కి ప్రాణాపాయం అయితే లేదని అయితే అతని తలకు గాయాలు తగిలాయని చెబుతున్నారు, అలాగే కుడి చీలమండపై లెగిమెంట్ గాయం కూడా అయినట్లు తెలుస్తోంది.

ఇక గతంలో రిషబ్ పంత్, ఊర్వశీ రౌతేలా ఇద్దరూ ప్రేమలో ఉన్నారని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే రిషబ్ పంత్ మాత్రం ఈ విషయం మీద ముందు స్పందించలేదు కానీ తర్వాత ఇషా నేగి అనే ఒక యువతితో తాను ప్రేమలో ఉన్నానని ప్రకటించడంతో వీరి మధ్య ఏమీ లేదని ఒకవేళ ఉన్నా ప్రస్తుతానికైతే ఆ బంధానికి పుల్ స్టాప్ పడినట్లేనని క్లారిటీ వచ్చినట్లుంది. అయితే ఎప్పటికప్పుడు రిషబ్ పంత్ ను పరోక్షంగా ఊర్వశీ రౌతేలా కామెంట్ చేస్తూనే వచ్చింది. ఇటీవల కూడా ఆమె ఆర్పీ అనే కామెంట్ చేసినప్పుడల్లా రిషబ్ పంత్ గురించి అని అందరూ అనుకున్నారు కానీ ఈ మధ్య రామ్ పోతినేనితో కలిసి ఒక సినిమా చేసిన నేపథ్యంలో తాను ఆర్ఫీ అన్నది రామ్ పోతినేని పేరు అంటూ ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది, అయినా ఎవరూ నమ్మలేదు అనుకోండి అది వేరే విషయం. 

Also Read: Dil Raju Shock: 'మైత్రీ'కి మరో షాకిచ్చిన దిల్ రాజు.. త్యాగమూర్తిని కాదంటూ కామెంట్స్!

Also Read: SSC Exams: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. పూర్తి టైమ్ టేబుల్ ఇదే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News