Urfi Javed in transparent top: ట్రాన్స్‌పరెంట్ టాప్‌లో ఉర్ఫి జావేద్.. ట్రోల్స్‌కి జావేద్ సమాధానం

Urfi Javed in transparent top: ట్రాన్స్‌పరెంట్ డ్రెస్సులు వేసుకోవడంలో, ఫ్యాషన్‌లో నయా ట్రెండ్స్ సృష్టించడంలో, వాటిని అనుసరించడంలో బాలీవుడ్ మోడల్ బిగ్ బాస్ ఓటిటి కంటెస్టంట్ ఉర్ఫి జావేద్ తర్వాతే ఎవరైనా అనే పేరు ఉంది. బిగ్ బాస్ ఓటిటి రియాలిటీ షోలో పాల్గొన్న తర్వాత ఉర్ఫి జావేద్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2021, 11:18 PM IST
Urfi Javed in transparent top: ట్రాన్స్‌పరెంట్ టాప్‌లో ఉర్ఫి జావేద్.. ట్రోల్స్‌కి జావేద్ సమాధానం

Urfi Javed in transparent top: ట్రాన్స్‌పరెంట్ డ్రెస్సులు వేసుకోవడంలో, ఫ్యాషన్‌లో నయా ట్రెండ్స్ సృష్టించడంలో, వాటిని అనుసరించడంలో బాలీవుడ్ మోడల్ బిగ్ బాస్ ఓటిటి కంటెస్టంట్ ఉర్ఫి జావేద్ తర్వాతే ఎవరైనా అనే పేరు ఉంది. బిగ్ బాస్ ఓటిటి రియాలిటీ షోలో పాల్గొన్న తర్వాత ఉర్ఫి జావేద్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఉర్ఫి జావేద్ పబ్లిక్ అప్పీయరెన్స్ కూడా అంతే ఎక్కువగా పెరిగిపోయింది. అలా పబ్లిక్‌లోకి వచ్చే క్రమంలో ఉర్ఫి జావేద్ ధరిస్తున్న దుస్తులు సైతం అంతే హాట్ టాపిక్ అవుతున్నాయి. హాట్ బ్యూటీగా పేరున్న ఉర్ఫి జావేద్ తన చిట్టిపొట్టి దుస్తులతో మరింత హీటెక్కిస్తోంది.  

తాజాగా ఉర్ఫి జావేద్ ధరించిన ఓ సీ థ్రూ బ్లాక్ కలర్ టాప్ (Urfi Javed in see through top) కూడా అలాగే ట్రోల్ అయింది. ట్రాన్స్‌పరెంట్ టాప్‌లో ఉర్ఫి జావేద్‌ని చూసిన నెటిజెన్స్ ఆమె హాట్‌నెస్ కోశెంట్‌ గురించి చర్చించుకోవడం ఒక ఎత్తయితే... డైట్ సబ్య (Diet Sabya) అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ ఫ్యాషన్ క్రిటిక్ ఆమెను ట్రోల్ చేసిన తీరు మరో ఎత్తు. ఉర్ఫి జావేద్ ధరించిన సీ థ్రూ టాప్‌కి సంబంధించిన ఒరిజినల్ ఫ్యాషన్ ఫోటోను షేర్ చేసిన డైట్ సబ్య.. ఆ పక్కనే ఉర్ఫి జావేద్ ఫోటోను పెట్టి 'గందీ కాపీ' అంటూ క్యాప్షన్ పెట్టాడు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Diet Sabya (@dietsabya)

 

డైట్ సబ్య పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుపై తనదైన స్టైల్లో స్పందించిన ఉర్ఫి జావేద్ (Urfi Javed photos).. నువ్వేం అనుకున్నా నాకేం పర్వాలేదు. డైట్ సబ్య కూడా నా గురించి మాట్లాడుకుంటున్నారు చూడు.. అదే నా సక్సెస్ అన్నట్టుగా రిప్లై ఇచ్చింది.

Trending News