Upendra UI Movie: యూఐ మూవీ క్లైమాక్స్‌పై ఉపేంద్ర క్లారిటీ.. ఆ ప్రచారం అబద్దం

Upendra UI Movie Updates: యూఐ మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమయ్యారు కన్నడ స్టార్ ఉపేంద్ర. చాలా రోజుల తరువాత ఆయన స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Dec 19, 2024, 01:05 PM IST
Upendra UI Movie: యూఐ మూవీ క్లైమాక్స్‌పై ఉపేంద్ర క్లారిటీ.. ఆ ప్రచారం అబద్దం

Upendra UI Movie Updates: సినీ ఇండస్ట్రీలో హీరోగా.. డైరెక్టర్‌గా తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నారు కన్నడ స్టార్ ఉపేంద్ర. ఆయనకు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక 90లలో ఉపేంద్ర మూవీ వస్తుందంటే.. థియేటర్స్‌కు జనాలు క్యూకట్టేవారు. కన్యాదానం, రా, ఎ, ఉపేంద్ర, రక్త కన్నీరు తదితర చిత్రాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. అందరూ హీరోల్లా రెగ్యులర్ జోనర్ కాకుండా.. డిఫరెంట్ స్టైల్లో కథ తీసుకుంటూ.. సరికొత్తగా తెరక్కెంచడంలో ఆయన స్టైలే వేరు. గత కొన్నేళ్లుగా దర్శకత్వానికి గ్యాప్ ఇచ్చిన ఉపేంద్ర.. ప్రస్తుతం హీరోగా మాత్రమే యాక్ట్ చేస్తున్నారు. అయితే తాజాగా మరోసారి ఆయన దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు.

ఉపేంద్ర దర్శకత్వం వహిస్తూ.. హీరోగా నటించిన మూవీ 'యూఐ'. ఈ నెల 20న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఉపేంద్ర తెలుగు ప్రమోషన్స్‌ ఈసారి గట్టిగానే చేశారు. ఇంటర్వ్యూలతో యూఐ మూవీని ఆడియన్స్‌లోకి తీసుకువెళ్లారు. యూఐ మూవీ డబ్బింగ్ మూవీ అయినా.. ఉపేంద్రకు తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ఉండడంతో బుకింగ్స్‌ మంచి రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ చెబుతున్నారు. వింటేజ్ ఉపేంద్ర దర్శకత్వం మరోసారి యూఐ మూవీ ద్వారా చూడొచ్చని అభిమానులు అంటున్నారు. 

ఇప్పటికే రిలీజైన టీజర్లు, ట్రైలర్లు మూవీపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. ఈ మూవీ క్లైమాక్స్‌పై ఇటీవల రూమర్లు ఎక్కువగా వచ్చాయి. ఈ సినిమాకు రెండు క్లైమాక్స్‌లు ఉంటాయని.. ఒక్కొ థియేటర్‌లో ఒక క్లైమాక్స్ ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఎప్పుడు సరికొత్త ప్రయోగాలు చేసే ఉపేంద్ర.. ఇలాంటి ప్రయోగం కూడా చేసి ఉంటారని అందరూ అనుకున్నారు. అయితే ఈ విషయంపై స్వయంగా ఉపేంద్రనే క్లారిటీ ఇచ్చారు. రెండు క్లైమాక్స్‌లు ఉన్నాయని జరుగుతున్న ప్రచారం అబద్దమని కొట్టిపారేశారు. సినిమాలో ఒకటే క్లైమాక్స్ ఉంటుందని.. ఊహించిన దానికి కంటే భారీగా ఉంటుందని చెప్పారు. అందుకే ఈ చిత్రాన్ని ఎక్కువసార్లు చూడాలని అనిపిస్తుందన్నారు. 

‘యూఐ’ పాన్‌ఇండియా వైడ్‌గా కన్నడ, తెలుగుతోపాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. రీష్మా నానయ్య, ఇంద్రజిత్ లంకేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. లహరి ఫిల్మ్స్‌ అండ్‌ వెనుస్‌ ఎంటర్‌టైనర్స్‌ బ్యానర్లపై జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మించారు.

Also Read: Keerthy Suresh: పెళ్లైనా ఏమాత్రం తగ్గట్లేదుగా.. మెడలో మంగళ సూత్రం.. మోడ్రన్ డ్రెస్‌లో పిచ్చెక్కిస్తున్న మహానటి.. పిక్స్ వైరల్..

Also Read: Gold Price Today: ఫెడ్ కీలక ప్రకటన..దిగొచ్చిన బంగారం ధర..తులం ఎంత తగ్గిందంటే?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News