Upasana: మెగాస్టార్ చిరంజీవి కోడలుగా.. రామ్ చరణ్ భార్య గానే కాకుండా ఉపాసనకి ప్రత్యేకమైన పాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకు ముఖ్య కారణం ఆమె సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉండడం.. అలానే అపోలో మేనేజ్మెంట్ చూసుకుంటూ ఎంతోమందికి తన వంతు సహాయం చేస్తూ ఉండడం. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కోసం ఉపాసన చేసిన పని అందరిని ఆకట్టుకుంటుంది.
ఈ అత్తా కోడళ్ళ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎంతో అన్యోన్యంగా.. ఆప్యాయంగా కనిపిస్తూ ఉంటారు వీరిద్దరూ. తాజాగా తన అత్తమ్మ సురేఖ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన ఒక సూపర్ ఐడియా తో ముందుకొచ్చింది. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించి అందరినీ ఆకట్టుకుంది. సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా దీనిని ప్రారంభించడం మరో విశేషం. ఇలా చేసి ఉపాసన అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ బిజీ షెడ్యూల్స్‌లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ గారు ఎప్పుడూ ఇంట్లో సిద్ధం చేస్తుండేవారట. దీనిని గమనిస్తూ వచ్చిన ఉపాసన…సురేఖ కొణిదెల వంటకాలను "అత్తమ్మ కిచెన్" ద్వారా అందరితో పంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారట. ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్‌లు వారికి మంచి ఫుడ్ అందిస్తాయని అందుకే ఈ ఐడియా అమలు చేశాను అంటున్నారు ఉపాసన.
ఉపాసన కొణిదెల తన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకుని, ఈ కిచెన్ రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. సంప్రదాయం, ప్రేమకు చిహ్నంగా ఈ "అత్తమ్మ కిచెన్"ని నిలబెట్టాలని రామ్ చరణ్ భార్య ఉపాసన కాంక్షిస్తున్నారు. అందుకే తన అత్తమ్మ సురేఖ కొణిదెల పుట్టినరోజున ఈ వెంచర్‌కు ప్రారంభించారు. ఇంట్లో వండిన ఈ భోజనాన్ని, ఒక్కో వంటకం రుచిని అనుభవించమని అందరినీ ఆహ్వానిస్తున్నారు అత్తమ్మ కిచెన్ యూనిట్.
అంతేకాకుండా ఈ అత్తమ్మ కిచెన్ గురించి మరిన్ని వివరాలు తెలియాలి అంటే దిగువ లింక్‌లను అనుసరించండి అంటూ కొన్ని లింక్స్ కూడా షేర్ చేశారు.
వెబ్‌సైట్: www.athammaskitchen.com
వాట్సప్: http://api.whatsapp.com/send?phone=919866589955&text=Hi
ట్విట్టర్: https://twitter.com/athammaskitchen
ఇన్ స్టాగ్రాం: https://www.instagram.com/athammaskitchen
ఫేస్ బుక్: https://www.facebook.com/people/Athammas-Kitchen
Also Read: Cancer Diet: కేన్సర్‌ను సైతం వణికించి దరిచేరకుండా చేసే ఆహార పదార్ధాలు ఇవే
Also Read: Pineapple Benefits: రోజూ పైనాపిల్ తీసుకుంటే ఈ 4 వ్యాధులకు చెక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook