Akkineni Nagarjuna Unknown Facts: వందల కోట్ల ఆస్తి.. రెండు పెళ్లిళ్లు.. అఫైర్లు.. నాగార్జున గురించి మీకు తెలియని విషయాలివే!

Unknown Facts About Akkineni Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఎక్కువగా చర్చ జరగని, మీకు తెలియని విషయాలు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 29, 2022, 02:57 PM IST
Akkineni Nagarjuna Unknown Facts: వందల కోట్ల ఆస్తి.. రెండు పెళ్లిళ్లు.. అఫైర్లు.. నాగార్జున గురించి మీకు తెలియని విషయాలివే!

Unknown Facts About Akkineni Nagarjuna: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురించి ఎక్కువగా చర్చ జరగని, మీకు తెలియని విషయాలు మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. నాగార్జున సుమారు 90కి పైగా తెలుగు, హిందీ సినిమాలలో కనిపించారు. అక్కినేని నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన సుడిగుండాలు అనే సినిమాలో 1968లో చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు.  

1986లో విక్రమ్ అనే సినిమాతో ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చారు. సుమారు 90 సినిమాల్లో హీరోగా కనిపించిన ఆయన కొన్ని హిందీ కొన్ని తమిళ సినిమాలలో అతిథి పాత్రల్లో కనిపించారు. ఇక టెలివిజన్ రంగంలో కూడా నాగార్జున కీలక పాత్ర పోషించారు. ఆయన మొట్టమొదటిసారిగా నిర్మాతగా తెలుగులో యువ అని ఒక టెలి సిరీస్ కూడా నిర్మించారు. అలాగే అమితాబచ్చన్ హిందీలో చేసిన కౌన్ బనేగా కరోడ్పతిని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేరుతో హోస్ట్ చేశారు. అలాగే బిగ్ బాస్ కి కూడా హోస్ట్ గా వ్యవహరించారు. ఇక నాగార్జున అనేక చారిటీ వర్క్ కూడా చేస్తూ ఉంటారు. ఆయన తన భార్య అమలతో కలిసి బ్లూ క్రాస్ అనే ఒక ఎన్జీవో నడుపుతున్నారు. నాగార్జునకి ఇద్దరు కుమారులు అందరూ నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కూడా హీరోలుగా రాణిస్తున్నారు.

నాగార్జున కెరీర్ లో రెండు జాతీయ అవార్డులు సంపాదించారు. నాగార్జున బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. అలాగే అమెరికాలోని మిచిగన్ యూనివర్సిటీలో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లో ఎంఎస్ పూర్తి చేశారు. ముందుగా వెంకటేష్ సోదరి లక్ష్మి అనే యువతిని వివాహం చేసుకున్న ఆయన తరువాత ఆమె నుంచి విడాకులు తీసుకుని తన సహనటి అమలను వివాహం చేసుకున్నారు. ఇక తన తండ్రి అక్కినేని ఏర్పాటు చేసిన అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహణ మొత్తం ఆయనే దగ్గరుండి చూసుకుంటున్నారు. నాగార్జున మొత్తం ఆస్తి విలువ సుమారు రూ.1200 కోట్ల దాకా ఉంటుందని అంటున్నారు, అయితే అది కొనుగోలు చేసినప్పటి విలువ, ఇప్పుడు అవి కొన్ని వందల రేట్లు ఉండే అవకాశం ఉంది. 

నాగార్జునకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అత్యంత విలువైన భూములు ఉన్నాయి. ఆయనకు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఇండియన్ సినీ హిస్టరీలోనే ఒక అరుదైన ఘనతను కూడా నాగార్జున సాధించారు. అది ఏమిటంటే తన తండ్రి తన కుమారులతో కలిసి ఆయన ఒకే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అదే విధంగా సినిమాలో ఆయన కోడలు అక్కినేని సమంత కూడా కనిపించారు. అప్పటికి వారి వివాహం జరగలేదు. తర్వాత వీరికి విడాకులు కూడా అయ్యాయి. ఒకప్పుడు ముంబై మాస్టర్స్ అనే ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ టీంకి కూడా నాగార్జున ఓనర్ గా వ్యవహరించేవారు. అలాగే మహేంద్రసింగ్ ధోనితో కలిసి మహి రేసింగ్ టీమ్ అనే ఒక టీంకి కూడా అధిపతిగా వ్యవహరించేవారు. నాగార్జునకు కార్లు అంటే చాలా ఇష్టం.

ఆయన రేంజ్ రోవర్ నుంచి ఆడి బిఎండబ్ల్యూ మెర్సిడెస్ బెంజ్ అండి కోట్ల రూపాయల కారులను కలెక్ట్ చేశారు. అమలను వివాహం చేసుకున్న తర్వాత ఆయన హీరోయిన్ టబుతో డేటింగ్ చేశారని ప్రచారం జరిగింది. పదేళ్లపాటు మీరు డేటింగ్ లో ఉన్నారు కానీ వివాహం చేసుకునే ఉద్దేశం లేదని తెలియడంతో టబు ఆయనకు దూరమైంది. ప్రస్తుతం నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. అలాగే ఆయన హిందీలో బ్రహ్మాస్త్ర అనే ఒక సినిమాలో కూడా కీలకపాత్రలో నటించారు ఈ సినిమా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Also Read: Sita Ramam -Karthikeya 2 Collections: రచ్చ రేపిన సీతారామం-కార్తికేయ 2.. లైగర్ ను దాటేసి మరీ!

Also Read: Liger Movie Day 4 Collections: దారుణంగా పడిపోయిన లైగర్ వసూళ్లు.. హిందీలో కూడా సేం సీన్!

Trending News