Hotstar uninstall చేయాల్సిందిగా ట్విటర్‌లో నిరసనలు

డిస్నీ + హాట్‌స్టార్ యూజర్స్ హాట్‌స్టార్ యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయాల్సిందిగా నెటిజెన్స్ ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ట్విటర్‌లో #UninstallHotstar అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 27, 2021, 08:39 PM IST
Hotstar uninstall చేయాల్సిందిగా ట్విటర్‌లో నిరసనలు

#UninstallHotstar Netizens slams Hotstar: ఫేమస్ ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన డిస్నీ + హాట్‌స్టార్‌కి వ్యతిరేకంగా ట్విటర్‌లో నిరసనలు మిన్నంటాయి. డిస్నీ + హాట్‌స్టార్ యూజర్స్ హాట్‌స్టార్ యాప్‌ని అన్‌ఇన్‌స్టాల్ చేయాల్సిందిగా నెటిజెన్స్ ట్విటర్‌లో పోస్టులు పెడుతున్నారు. దీంతో ప్రస్తుతం ట్విటర్‌లో #UninstallHotstar అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. హాట్‌స్టార్‌లో కొత్తగా ప్రారంభమైన ది ఎంపైర్ అనే వెబ్ సిరీస్‌లో మొఘల్స్‌ని గొప్పగా చూపించడం ఏంటంటూ నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అందుకే హాట్‌స్టార్ యూజర్స్ ఆ యాప్‌ని అన్ ఇన్‌స్టాల్ చేయాల్సిందిగా ట్విటర్‌లో నినదిస్తున్నారు.

Also read : Bigg Boss OTT: బిగ్‌బాస్ హౌస్ లోఉన్న హాట్ భామల పారితోషికాలు ఎంతో తెలుసా..??

ఎంతో మందిని ఊచకోత కోసిన ఎంపైర్‌గా పేరున్న మొఘల్ ఎంపైర్‌ని గొప్పగా చూపించడం ఏంటని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా గూగుల్ ప్లే స్టోర్‌లో (Google playstore) రిపోర్ట్ చేసి 1 స్టార్ రేటింగ్ ఇవ్వాల్సిందిగా తోటి యూజర్స్‌కి సూచిస్తున్నారు. యూజర్స్ అలా చేస్తే కానీ హాట్‌స్టార్ వాళ్లు మరోసారి ఇలాంటి దుస్సాహసం చేయరు అంటూ యూజర్స్ (Hotstar app) మండిపడుతున్నారు. 

Also read : Bollywood celebrities bodyguards salaries: బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ బాడీగార్డులకు కోట్లలో పారితోషికం

గత కొన్ని శతాబ్ధాలుగా మొఘల్ చక్రవర్తుల (Mughal kings) గురించి గొప్పగా చదివి చదివి, విని విని బ్రెయిన్‌వాష్ అయిపోయింది. చివరకు రహదారులకు కూడా వాళ్ల పేర్లే. ఇకనైనా ఆ పద్ధతి మారకపోతే ఎలా అంటూ ఇంకొంత మంది తమ వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. మొత్తానికి ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌కి (OTT) అప్పుడప్పుడు ఇలాంటి సెగలు తగులుతూనే ఉన్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News