Jr NTR: ఎన్టీఆర్ వల్ల ఆ ఇద్దరు హీరోలకి నష్టం.. కంగారులో అభిమానులు!

NTR Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న.. దేవర సినిమా మొదటి భాగం ఏప్రిల్ లో.. విడుదల కావాల్సింది.. కానీ అక్టోబర్ 10కి వాయిదా పడింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా అనుకున్న.. దానికంటే ముందే.. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి రావడానికి సిద్ధం అవుతున్నట్లు.. చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో అదే రోజున విడుదలవుతున్న సినిమాల పరిస్థితి.. ఏంటి అని అభిమానులు కంగారుపడుతున్నారు.   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 14, 2024, 01:10 PM IST
Jr NTR: ఎన్టీఆర్ వల్ల ఆ ఇద్దరు హీరోలకి నష్టం.. కంగారులో అభిమానులు!

Devara release date: ఎప్పుడో ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్.. అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆ తర్వాత మళ్లీ ఈ వెండితెరపై కనిపించలేదు. దీంతో అభిమానులు అందరూ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా దేవర.. కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న.. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కాబోతోంది. 

దేవరా సినిమాలోని మొదటి భాగం ఏప్రిల్ లో విడుదల కావాల్సింది.. కానీ సినిమా అక్టోబర్ 10న విడుదలవుతుంది అని చిత్ర బృందం సినిమాని వాయిదా వేసింది. దీంతో అక్టోబర్ దాకా.. ఎదురుచూడాలని అభిమానులు ఫిక్స్ అయ్యారు. అయితే తాజాగా ఇప్పుడు చిత్ర బృందం.. సినిమా విడుదలను ప్రీపోన్ చేస్తున్నట్లుగా ప్రకటించి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది. 

దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా.. విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్..అందరూ హ్యాపీ. కానీ రవితేజ, దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్ మాత్రం దేవర సినిమా ప్రీపోన్ అవడంతో కంగారు పడుతున్నారు. 

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమా కూడా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. మరోవైపు దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించిన.. లక్కీ భాస్కర్ కూడా అదే రోజున విడుదల కి సిద్ధం అవుతుంది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా కూడా అదే రోజున విడుదల కాబోతుండడంతో ఈ ఇద్దరు హీరోలు అయితే లైన్ లో నుంచి.. తప్పుకోవాలి లేకపోతే అదే రోజున తమ సినిమాని కూడా విడుదల చేయాలి. 

ఒకవేళ ఎన్టీఆర్ దేవర సినిమాతో.. పాటు విడుదల అయ్యి దేవర కి కొంచెం మంచి టాక్ వచ్చినా కూడా అందరూ దేవర సినిమా చూడడానికే.. ఆసక్తి చూపిస్తారు. పైగా అసలే డిజాస్టర్లతో సతమతమవుతున్న రవితేజ కి మిస్టర్ బచ్చన్ సినిమా కీలకంగా మారబోతోంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవ్వాలని రవితేజ కంటే ఫ్యాన్స్ ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

మరోవైపు దుల్కర్ సల్మాన్ కూడా తెలుగులో కనిపించి చాలా కాలం అయింది. మరి ఎన్టీఆర్ దేవర రాకతో ఇద్దరు హీరోలు సినిమాలు వాయిదా వేస్తారా లేక అదే రోజున విడుదల చేస్తారా అని ఇంకా తెలియాల్సి ఉంది.

Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News