Truth Behind Prabhas Having Wig: సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ అంటే దాదాపు అందరికీ చాలా ఆసక్తి ఉంటుంది, మరీ ముఖ్యంగా వారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు? ఎలాంటి బట్టలు ధరిస్తారు? వాటి ధర ఎంత? వాళ్ళు వాడే కార్లు ఎలా ఉంటాయి? వాళ్ళు వాడే వస్తువులు ఎలా ఉంటాయి? ఇలా అన్ని విషయాల మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య చాలా మందికి హీరోల జుట్టు ఒరిజినలా? కాదా? అనే విషయం మీద డౌట్లు వస్తున్నాయి.
ఇప్పటికే మహేష్ బాబు విగ్గు గురించి సూపర్ స్టార్ కృష్ణ మేకప్ మ్యాన్ చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అవ్వగా దానిమీద చాలా రోజులపాటు చర్చ జరిగింది. ఇప్పుడు వెంకటేష్ విగ్గు గురించి ఆయన మేకప్ మ్యాన్ కామెంట్ చేయడంతో దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఇక ఈ విగ్గుల వ్యవహారంలోనే హీరోలను ఇతర హీరోలను ఫాన్స్ ఇప్పుడు టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా హీరో ప్రభాస్ వాడేది విగ్గే అంటూ ఒక నెటిజన్ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశాడు.
ఇప్పటివరకు తాను ప్రభాస్ ది ఒరిజినల్ జుట్టు అనుకున్నానని కానీ ప్రభాస్ వాడేది విగ్గు అంటూ ఆయన ఒక వీడియో షేర్ చేశాడు. ఆయన వీడియో షేర్ చేసిన వీడియో పాతదే అయినా అందులో ప్రభాస్ జుట్టు చెరిగి పోకుండా హెయిర్ స్టైలిస్ట్ ఆయన జుట్టు సరి చేస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఒరిజినల్ జుట్టుని స్టైల్ చేస్తున్నట్లు కాకుండా చాలా డెలికేట్ గా పట్టుకుని ఆయన జుట్టుని సరి చేస్తూ ఉండడంతో ఇప్పుడు ఇలాంటి కామెంట్లు తెరమీదకు వస్తున్నాయి.
వాస్తవానికి హీరోలు కూడా మనలాంటి మనుషులే వాళ్ల జుట్టు కూడా వయసును బట్టి రాలిపోవడం పలుచబడడం జరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి ఒరిజినల్ జుట్టుని సినిమాల్లో చూపిస్తే ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించరు కనుక ఆయా సినిమాల కోసం దర్శకులు, పాత్రల అవసరాన్ని బట్టి హీరోలు విగ్గులు ధరించడమో మరొకటో చేస్తూ ఉంటారు. ఇంత మాత్రాన ఇతర హీరోల ఫ్యాన్స్ అలాగే కామన్ ఆడియన్స్ హీరోల విగ్గుల గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు.
కానీ పర్సనల్ విషయాలు మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఇలాంటి కామెంట్లు చేయడం వల్ల ఫ్యాన్ వార్స్ పెరగడం తప్ప మరొక ఉపయోగం లేదని చెప్పాలి. అయితే ఇందులో ప్రభాస్ నిజంగా విగ్గు వాడారా? లేదా? అనే సంగతి పక్కన పెడితే వాడితే నష్టమేముంది? ఒకవేళ అది ఆయన ఒరిజినల్ జుట్టు అయితే కనుక అనవసరంగా ఇలా నోరు పారేసుకుని ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురికావడం ఎందుకు?
Also Read: Vaani Kapoor Hot Photos: దిమ్మతిరిగిపోయే హాట్ ట్రీట్ ఇచ్చిన వాణి కపూర్.. ఇదేందయ్యా ఇదీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.