Guntur Kaaram Dialogues: మాటల మాంత్రికుడికి ఏమైంది.. సినిమా మొత్తానికి కేవలం ఆ ఒక్కసీన్‌లో తన మార్క్‌!!

Trivikram Mark: తెలుగు ప్రేక్షకులను తన డైలాగ్స్ లో ఫిదా చేసిన దర్శకుడు త్రివిక్రమ్. అలాంటి త్రివిక్రమ్ ప్రస్తుతం తీస్తున్న సినిమాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. అసలు ఈ చిత్రాలు తీస్తుండేది మన మాటల మాంత్రికుడెన అనేలా చేస్తున్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2024, 12:55 PM IST
Guntur Kaaram Dialogues: మాటల మాంత్రికుడికి ఏమైంది.. సినిమా మొత్తానికి కేవలం ఆ ఒక్కసీన్‌లో తన మార్క్‌!!

Trivikram Srinivas: నువ్వు నాకు నచ్చావ్.. నువ్వే కావాలి.. చిరునవ్వుతో స్వయంవరం.. ఇలా చెప్పుకుంటూ పోతే త్రివిక్రమ్ డైలాగ్స్ తో మ్యాజిక్ చేసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆ చిత్రాలలో కథ కన్నా కూడా డైలాగ్స్ ప్రధానమైన పాత్ర పోషించాయి. చిరునవ్వుతో సినిమాలో ‘సంతోషం సగం బలం’ పాట వింటే చాలు.. మన మాటల మాంత్రికుడు మ్యాజిక్ అర్థమవుతుంది. ‘నిన్న రాత్రి పీడకల నేడు తలుచుకుంటూ నిద్రమానుకోగలమా.. ఎంత మంచి స్వప్నమైన అందులోనే ఉంటూ రెప్పవేయకుండా ఉండగలమా’... శభాష్ అనిపించక మానుతుందా ఈ లిరిక్? మరి ఇంతటి మ్యాజిక్ సృష్టించిన మాటల మాంత్రికుడికి ఇప్పుడు ఏమైంది అనేది అందరి సందేహం.

నువ్వే ..నువ్వే సినిమాతో దర్శకుడిగా మారారు త్రివిక్రమ్. నిజం చెప్పాలి అంటే త్రివిక్రమ్ తీసిన అన్ని చిత్రాలలో.. నువ్వే నువ్వే సినిమాకి ప్రత్యేక స్థానం ఇవ్వచ్చు. ఎందుకంటే నువ్వే నువ్వే చిత్రంలో ప్రతి డైలాగ్ మనకి ఇప్పటికీ గుర్తుంది. ‘మనం అనుకున్నవన్నీ నిజాలు.. అనుకొనివన్నీ అబద్ధాలు అయితే బాగుంటుంది కదా’...’ఒక మనిషి తప్పు చేస్తే తప్పు.. ఒప్పు చేస్తే ఒప్పు అంటే అది ఇష్టం..అదే ఆ మనిషి ఏమి చేసినా మనం దానిని సహిస్తే.. అదే ప్రేమ’... ‘అమ్మ అంజలి ఆవకాయ.. ఎప్పుడు బోర్ కొట్టావు’... ఇలా తన కలం నుంచి ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ ఈ చిత్రానికి రాసుకున్నారు త్రివిక్రమ్. 

మొదటి సినిమాతోనే దర్శకుడిగా సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ ఆ తరువాత అతడు చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. తరువాత వచ్చిన జల్సా‌… ఖలేజా పరవాలేదు అనిపించుకోగా.. అత్తారింటికి దారేది త్రివిక్రమ్ కు ఇండస్ట్రీ హిట్ తెచ్చి పట్టింది. అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్ లో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఆ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఇక్కడ వరకు కథ బాగానే ఉన్నా ఆ తరువాతే త్రివిక్రమ్ స్టైల్ మారింది..

ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆ.. ఆ’ ‘అలా.. వైకుంఠపురంలో’ మంచి సక్సెస్ సాధించిన.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ మాత్రం ఆ చిత్రలలో పెద్దగా కనిపించలేదు. ముఖ్యంగా త్రివిక్రమ్ అభిమానులకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. ఈ రెండు చిత్రాలలో అక్కడక్కడ త్రివిక్రమ్ డైలాగ్స్ వినిపించిన.. అవి తప్పకుండా త్రివిక్రమ్ రేంజ్ అయితే కాదు.

ఇక ఇప్పుడు వచ్చిన గుంటూరు కారం సినిమా చూస్తే.. మనకు పూర్తిగా మారిపోయిన త్రివిక్రమ్ కనిపించక మానరు. ఈ సినిమాలో మహేష్ బాబు తన నటన పరంగా వందకి వంద శాతం న్యాయం చేశారు. గుంటూరు కారం చిత్రం కనీసం యావరేజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందంటే దానికి కారణం మహేష్ బాబు యాక్టింగ్. కానీ గుంటూరు కారం నెగిటివ్ టాక్ ఉందిమాత్రం పూర్తిగా త్రివిక్రమ్ వల్ల అని చెప్పక మానలేం. గుంటూరు కారం లాంటి సినిమా వేరే దర్శకుడు తీసివుంటే.. ప్రేక్షకులు బాగానే ఉంది అని అనే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది త్రివిక్రమ్ సినిమా అని మైండ్లో ఫిక్స్ అయ్యి వెళ్లి ఉండరు కాబట్టి. అలాంటిది త్రివిక్రమ్ సినిమా అని ఫిక్స్ అయి గుంటూరు కారం చిత్రం కి వెళ్ళినప్పుడు మాత్రం ప్రేక్షకులకు తీవ్ర నిరాశ ఎదురైంది.

చిత్రంలో కథ చాలా ఉన్న.. ఎందుకో కథని పెద్దగా ముట్టుకోకుండా.. కేవలం కామెడీ సీన్లు.. ఫైట్ సీన్స్ తో కథను ముందుకు నడిపించారు దర్శకుడు. రమ్యకృష్ణ క్యారెక్టర్ ని ఈ చిత్రంలో చాలా బాగా తెరకెక్కిచుండొచ్చు. కానీ క్లైమాక్స్ వరకు అసలు ఆ క్యారెక్టర్ గురించి పట్టించుకోలేదు. ఇలాంటి తప్పు చేసే గతంలో అజ్ఞాతవాసి లాంటి‌ డిజాస్టర్ తీసారు ఈ డైరెక్టర్. మళ్లీ అదే తప్పు ఇందులో రిపీట్ చేశారు. 

సినిమా మొత్తం మీద త్రివిక్రమ్ మార్క్ కనిపించింది కేవలం క్లైమాక్స్ లోనే.  ‘నేను వాడిలా మాట్లాడడమేంటి నాన్న.. వాడే నాలా మాట్లాడుతున్నారు’ అని రమ్యకృష్ణ అనే దగ్గర మాత్రమే ఇది త్రివిక్రమ్ సినిమా అనిపిస్తుంది. అలాంటి డైలాగ్స్ ఈ చిత్రంలో మరికొన్ని ఉంది ఉంటే ఈ సినిమా వేరేలా ఉండేదేమో. ‘చూడడానికి ఇంత అందంగా ఉంటావు ఆ గడ్డం ఏంటి రా..’ అని రమ్యకృష్ణ అడిగినప్పుడు..’ లవ్ ఫెయిల్యూర్.. ఆ అమ్మాయి నువ్వే’ అని మహేష్ బాబు చెప్పే లాంటి తల్లి.. కొడుకు సీన్లు సినిమా మొదటి నుంచి కొన్ని పెట్టి ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యుండక మానదు. 

కానీ అవేవీ పట్టించుకోకుండా త్రివిక్రమ్ మొదటినుంచి ఏదో కామెడీ సీన్లు.. హీరోయిజం తో..సినిమా తీసేసి క్లైమాక్స్ లో మాత్రమే ఒక పది నిమిషాలు తన మార్క్ చూపించారు. మరి ఇకనైనా త్రివిక్రమ్ మారి.. తన రాబోయే సినిమాలతో అన్న మరోసారి మనకి మాటల మాంత్రికుడుగా తన అవతారం చూపిస్తారో లేదో చూడాలి.

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

Also Read: Saindhav Twitter Review: సైంధవ్ ట్విట్టర్ రివ్యూ.. ఇది పెద్దోడి విశ్వరూపం.. వెంకీ మామ హిట్ కొట్టేశాడా..?

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News