SS Rajamouli-Mahesh Babu: మహేష్-రాజమౌళి సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్?

Tollywood: మహేష్ బాబు-రాజమౌళి సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. పాన్ వరల్డ్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్ నటించబోతున్నట్లు సమాచారం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2023, 10:51 AM IST
SS Rajamouli-Mahesh Babu: మహేష్-రాజమౌళి సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్?

SS Rajamouli-Mahesh Babu Movie Update: సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. భారతీయ సినీ చిరిత్రలోనే హాయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఇది కంప్లీట్ అియన తర్వాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారు. ఈ మూవీ స్టార్ట్ కాకముందే తన లుక్ కోసం తెగ కష్టపడుతున్నాడు మహేష్. దీనికి సంబంధించిన వీడియోలు రీసెంట్ గా నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. 

ఈ యాక్షన్ అడ్వెంచర్‌ చిత్రంలో ముగ్గురు హీరోయిన్స్ కు ఛాన్స్ ఉంది. ఆ పాత్రల కోసం ముగ్గురు బాలీవుడ్ బ్యూటీలను ఎంపికచేయనున్నట్లు తెలుస్తోంది. వర్క్‌షాప్‌ నిర్వహించి కథానాయికలను ఫైనల్ చేయనున్నారు రాజమౌళి మరియు అతని బృందం.  అంతేకాకుండా త్వరలో తారాగణం మరియు సిబ్బందిని కూడా ఖరారు చేయనున్నారు. ఈ చిత్రం యొక్క షూటింగ్ 2024 మొదటి త్రైమాసికంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో పెట్టుబడి పెట్టేందుకు కొన్ని హాలీవుడ్ స్టూడియోలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి కెఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రపంచాన్ని చుట్టే ఓయాత్రికుడిగా మహేష్ బాబు కనిపించనున్నారట. ఈ సినిమాను అమెజాన్ అడవుల్లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Nani 30 Glimpse: 'హాయ్ నాన్న'గా వచ్చేసిన నాని.. ఆకట్టుకుంటున్న గ్లింప్స్..

ప్రస్తుతం సూపర్ స్టార్ 'గుంటూరు కారం' సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తుండగా.. పీఎస్ వినోద్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుక రిలీజ్ చేయనున్నారు. 

Also Read: Trivikram: పెద్ద హీరోలతో సమానంగా త్రివిక్రమ్ రెమ్యూనరేషన్.. 'బ్రో' మూవీకి ఎంత తీసుకున్నాడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News