Tollywood Trendsetter Krishna: తన 80 ఏళ్ల వయసులో సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఈ రోజు తెల్లవారు జామున నాలుగు గంటలకు తొమ్మిది నిమిషాలకు ఆయన కన్ను మూసినట్లుగా కాంటినెంటల్ హాస్పిటల్ వైద్యులు ప్రకటించారు. 1942 మే 31న ఘట్టమనేని శివ రామకృష్ణమూర్తిగా జన్మించిన సూపర్ స్టార్ కృష్ణ ఆ తర్వాతి కాలంలో కృష్ణగా పేరు మార్చుకుని సినిమాలు చేస్తూ వచ్చారు. 64 ముందు చిన్న చిన్న పాత్రలు సినిమాల్లో చేశారు కానీ 65 లో హీరోగా నటించే అవకాశం దొరికింది.
అలా ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా తేనె మనసులు. ఆ తర్వాత తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీ పరిచయం చేసిన వ్యక్తిగా కృష్ణకు పేరు వచ్చింది. తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమాగా గూడచారి 116, తర్వాత తెలుగులో తొలి కౌబాయ్ సినిమాగా మోసగాళ్లకు మోసగాడు, తొలి ఫుల్ స్కోప్ సినిమాగా అల్లూరి సీతారామరాజు, తొలి సెవెంటీ ఎంఎం సినిమాగా సింహాసనం ఇలా అనేక సినిమాలకు ఆయనే ఆద్యుడిగా నిలిచాడు.
సుమారు తన కెరీర్ లో 350కి పైగా సినిమాల్లో నటించిన ఆయన 16 సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించాడు. 1970 పద్మాలయా నిర్మాణ సంస్థ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత అదే పేరుతో స్టూడియోస్ కూడా ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టుల విధానంలో వేగంగా సినిమాలను పూర్తి చేసిన నటశేఖర కృష్ణ సుమారు 30 ఏళ్ల పాటు ఏడాదికి పది సినిమాలు చొప్పున 300 సినిమాల్లో నటించారు.
ఇక తొలి ఈస్ట్ మన్ కలర్ మూవీగా ఈనాడు తొలి డిటిఎస్ మూవీగా తెలుగు వీర లేవరా అనే సినిమాలు కూడా ఆయన ద్వారానే బయటకు వచ్చాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తీవ్ర విషాదం నెలకొని ఉంది. ఆయన అభిమానులందరూ కూడా చివరి చూపు కోసం ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
Also Read: Super Star Krishna Last Video Audio : సూపర్ స్టార్ కృష్ణ చివరి వీడియో ఇదే.. అందులో ఏం మాట్లాడారంటే?
Also Read: Sad Year For Mahesh: మహేష్ బాబుకు వరుస విషాదాలు.. ఒకే ఏడాది తల్లి, తండ్రి, సోదరుడు మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook