Mahesh Babu Foundation: టాలీవుడ్ నటుల్లో సూపర్‌స్టార్ మహేశ్ బాబు చాలా ప్రత్యేకం. సేవాకార్యక్రమాల్లో ముందుండే మహేశ్ బాబు..ఒక్కరోజులోనే 30 మంది చిన్నారుల ప్రాణాలు కాపాడారు.
గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఫౌండేషన్ చేస్తున్న సహాయం అంతా ఇంతా కాదు. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా వేలాది మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు చేయించారు. ఇటీవలి కాలంలో మహేశ్ బాబు..ఫౌండేషన్ కార్యక్రమాల్ని మరింతగా విస్తరించారు. ఇప్పుడు మరో ఘనత సాధించారు.
ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకుని అద్బుతమైన కార్యక్రమం చేపట్టారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 30 మంది చిన్నారులకు ఒకేరోజు చికిత్స అందించి ఆ కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపారు. ఆంధ్ర హాస్పటల్స్‌లో ఈ చిన్నారులకు సర్జరీ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఆంధ్ర హాస్పటల్స్‌కు మహేశ్ బాబు సతీమణి నమ్రత ధన్యవాదాలు తెలిపారు. సోషల్ మీడియాలో స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. నమ్రత పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా చాలాకాలంగా చిన్నారులకు చికిత్స అందుతోంది. అవసరమైన చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు ఫౌండేషన్ ఉచితంగా నిర్వహిస్తోంది.
Also read: Pushpa Movie: అత్యంత సన్నిహితులకు విదేశాల్లో పుష్ప సక్సెస్ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook