Samantha: సినిమాలకు గుడ్‌బై చెప్పడంపై..స్పష్టత ఇచ్చిన సమంత

Samantha: టాలీవుడ్ నటి సమంత సినిమాలకు స్వస్తి చెప్పనుందనే వార్తలపై సమంత స్పందించింది. అనారోగ్యం కారణంగా త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పనుందనే వార్తలపై ఇప్పుడు స్పష్టత వచ్చింది.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 20, 2022, 08:45 PM IST
Samantha: సినిమాలకు గుడ్‌బై చెప్పడంపై..స్పష్టత ఇచ్చిన సమంత

నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత కెరీర్‌పరంగా దూసుకుపోతోంది. సరిగ్గా ఇదే సమయంలో సమంత అనారోగ్యం బారిన పడటంతో..ఇక సినిమాలకు వీడ్కోలు చెబుతుందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడీ వార్తలపై సమంత స్పందించింది.

టాలీవుడ్ అగ్రనటి సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతోంది. ఇదొక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సమంత అనారోగ్యం గురించి తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ప్రతిరోజూ వివిధ రకాల వార్తలు వ్యాపిస్తున్నాయి. సమంత అనారోగ్యం కారణంగా సమంత ఒప్పుకున్న సినిమాలపై సందిగ్దత ఏర్పడింది. ప్రస్తుతం చేస్తున్న ఖుషీ సినిమా పూర్తి చేసి..ఇతర బాలీవుడ్ ప్రాజెక్టులు వదిలేస్తుందనే ప్రచారం సాగుతోంది. 

అయితే వార్తలపై ఇప్పుడు స్పష్టత వచ్చింది. సమంత ప్రతినిధి ఒకరు ఈ పుకార్లను ఖండించారు. సమంత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని..సంక్రాంతి అనంతరం విజయ్ దేవరకొండతో చేస్తున్న ఖుషి సినిమా షూటింగ్‌లో పాల్గొంటారని సమంత ప్రతినిధి తెలిపారు. ఆ తరువాత ఇప్పటికే ఒప్పుకున్న బాలీవుడ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారన్నారు. సినిమా షూటింగ్ కోసం ఒకరిని నిరీక్షింపచేయడం మంచిది కాదన్నారు. ఒకవేళ నిరీక్షించడం సాధ్యం కాకపోతే..షెడ్యూల్ ప్రకారం షూటింగ్ చేసుకోవచ్చని ఇప్పటికే స్పష్టత ఇచ్చామన్నారు. అదే సమయంలో ఇప్పటివరకూ సమంత ఒప్పుకున్న ఏ ప్రాజెక్టు నుంచి కూడా వెళ్లిపోలేదని..కొత్త ప్రాజెక్టులు కూడా ఒప్పుకోలేదన్నారు. సమంత సినిమాలకు గుడ్‌బై చెబుతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని సమంత టీమ్ క్లారిటీ ఇచ్చేసింది.

Also read: HIT 2 on OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన హిట్ 2 , ఎప్పుడు, ఎందులో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News