Tollywood: జూనియర్ ఎన్టీఆర్‌తో వివి వినాయక్ అదుర్స్ సీక్వెల్, తదుపరి సినిమా

Tollywood: టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో దర్శకుడు వివి వినాయక్ కొన్ని కీలక విషయాలు మాట్లాడారు. ఆదుర్స్ సీక్వెల్ గురించి వివరణ ఇచ్చారు. మరో సినిమా అవకాశాలపై మాట్లాడారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 24, 2022, 10:20 PM IST
Tollywood: జూనియర్ ఎన్టీఆర్‌తో వివి వినాయక్ అదుర్స్ సీక్వెల్, తదుపరి సినిమా

Tollywood: టాలీవుడ్ స్టార్ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌తో దర్శకుడు వివి వినాయక్ కొన్ని కీలక విషయాలు మాట్లాడారు. ఆదుర్స్ సీక్వెల్ గురించి వివరణ ఇచ్చారు. మరో సినిమా అవకాశాలపై మాట్లాడారు.

ఎన్టీఆర్ వర్సెస్ వివి వినాయక్ అనేది తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ కాంబినేషన్. ఎందుకంటే ఈ కాంబినేషన్‌లో వచ్చిన ఆది, అదుర్స్ సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేశాయి. ముఖ్యంగా అదుర్స్ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు కూడా రాబట్టింది. అప్పట్లో అదుర్స్ సినిమా సీక్వెల్ ఉంటుందని సాక్షాత్తూ వివి వినాయక్ తెలిపారు. ఆ తరువాత ఎందుకో మరి..ఆ ప్రస్తావన రాలేదు. అదుర్స్ సీక్వెల్ గురించి దాదాపుగా అందరూ మర్చిపోయారు. 

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా అదుర్స్ సినిమా సీక్వెల్, తదుపరి ప్రాజెక్టుల గురించి వివరించారు. మంచి కధ లభిస్తే..జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తానని వివి వినాయక్ వివరించారు. మరోవైపు అదుర్స్ సినిమా సీక్వెల్‌పై అందరిలో ఉన్న ఆసక్తిపై తెర దించేశారు. అదుర్స్ సీక్వెల్ ఉండదని చెప్పేశారు. అప్పట్లో రెండు ఐడియాలు వచ్చినా..అవి నచ్చకపోవడంతో వదిలేశానని..ఆ సినిమా కెరీర్‌లో మంచి సినిమాగా చెప్పారు. ఆ ప్రభావాన్ని పాడు చేసుకోకుండా ఉంచే మంచిదన్నారు. 

మరోవైపు చిరంజీవితో సినిమా అంటే చాలా ఎక్సైట్‌మెంట్ ఉంటుందని..ఖైదీ నెంబర్ 150 సినిమాను చాలా ఆస్వాదిస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో లైగర్ ఫ్లాప్‌పై పూరి జగన్నాధ్ గురించి మాట్లాడారు. లైగర్ సినిమా ఫ్లాప్ కారణంగా పూరీ జీవితమేదీ మారదని..గతంలో ఎన్నో హిట్స్, ఎన్నో ఫ్లాప్స్, సూపర్ హిట్స్ ఇచ్చిన సంగతి మర్చిపోకూడదన్నారు. గతంలో కూడా పూరీ పని అయిపోయిందని భావించిన తరుణంలో..పోకిరి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడని గుర్తు చేశారు. సినిమా పరిశ్రమలో అందరికీ ఒడి దుడుకులు సహజమన్నారు. 

Also read: Sowmya Shetty Hot Photos: పొట్టి బట్టల్లో సౌమ్యా అందాల జాతర.. నెవర్ బిఫోర్ అనిపించేలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News