KS Nageswara Rao: డైరెక్టర్ కె.ఎస్‌ నాగేశ్వరరావు మృతి.. శ్రీహరికి లైఫ్ ఇచ్చిందే ఈయనే..!

KS Nageswararao passes away: హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో కోదాడ సమీపంలోకి రాగానే నాగేశ్వరరావుకి ఫిట్స్ వచ్చాయి. దాంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ రెండు, మూడు హాస్పిటల్స్ కి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి ఏలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో  చేర్పించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2021, 12:16 PM IST
  • టాలీవుడ్‌లో మరో విషాదం
  • ప్రముఖ డైరెక్టర్ కె.ఎస్‌ నాగేశ్వరరావు మృతి
  • శ్రీహరిని హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్..
 KS Nageswara Rao: డైరెక్టర్ కె.ఎస్‌ నాగేశ్వరరావు మృతి.. శ్రీహరికి లైఫ్ ఇచ్చిందే ఈయనే..!

Tollywood Director KS Nageswararao passes away: టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ కె.ఎస్‌ నాగేశ్వరరావు మరణించారు. నవంబర్‌ 27న  ఆయన ఊరు నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా హఠాత్తుగా ఫిట్స్‌ (Fits‌) వచ్చాయి. దీంతో ఆసుపత్రికి తరలించగా మార్గమధ‍్యలోనే తుదిశ్వాస విడిచారు.

హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో కోదాడ సమీపంలోకి రాగానే నాగేశ్వరరావుకి ఫిట్స్ వచ్చాయి. దాంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అక్కడ రెండు, మూడు హాస్పిటల్స్ కి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో చివరికి ఏలూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో (Hospital) చేర్పించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.

Also Read : Sovereign Gold Bonds: సోమవారం నుంచి సార్వ‌భౌమ గోల్డ్ బాండ్ల ఇష్యూ షురూ

నాగేశ్వరరావుకి (KS Nageswararao) కుమారుడు, కూతురు భార్య ఉన్నారు. దర్శకుడు నాగేశ్వరరావు మృతదేహాన్ని వాళ్ళ అత్తగారి నివాసమైన కవులూరు గ్రామంలో ఉంచారు. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆయన మరణ టాలీవుడ్ సెలబ్రిటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు.

నాగేశ్వరరావు స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ అసిస్టెంట్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. రిక్షా రుద్రయ్య  మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ పోలీస్ మూవీ చేశారు. ఆ తర్వాత వరుసగా శ్రీహరితో శ్రీశైలం, సాంబయ్య లాంటి మూవీలు చేశారు. తర్వాత వైజయంతి, రా, బిచ్చగాడా మజాకా వంటి మరికొన్ని సినిమాలు చేశారు. శ్రీహరిని (Srihari) హీరోగా పరిచయం చేయడంతో పాటు, ఆయనతో మూడు సినిమాలు చేయడంతో వాళ్ళ కుటుంబంతో నాగేశ్వరరావు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణించారని తెలిసి శ్రీహరి కుటుంబం విచారం వ్యక్తం చేసింది.

Also Read : Massive Traffic Jam: హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News