Tollywood 2022 : అదిరిన ఆరంభం.. ముభావమైన ముగింపు.. గెలిచిన చిత్రాలివే

RRR Hit In Tollywood 2022 ఆర్ఆర్ఆర్ వంటి హిట్లను చూసిన టాలీవుడ్.. రాధేశ్యామ్, ఆచార్య వంటి దారుణమైన సినిమాలను కూడా చూసింది. అలా ఈ ఏడాది కొన్ని సినిమాలు మాత్రమే కలిసి రాగా.. చాలా చిత్రాలు దెబ్బ కొట్టేశాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2022, 09:02 AM IST
  • నేటితో ముగియనున్న 2022
  • టాలీవుడ్‌కు కలిసొచ్చిన చిత్రాలివే
  • చిన్న సినిమాలకు ఊహించని విజయం
Tollywood 2022 : అదిరిన ఆరంభం.. ముభావమైన ముగింపు.. గెలిచిన చిత్రాలివే

Hit Movies In Tollywood 2022 టాలీవుడ్‌కు ఈ ఏడాది బాగానే కలిసి వచ్చింది. చిన్న చిత్రాలు విజయం సాధించాయి. పెద్ద హీరోల చిత్రాలు బోల్తా కొట్టినా కూడా కొన్ని పర్వాలేదనిపించాయి. రాజమౌళి తన మ్యాజిక్ కంటిన్యూ చేశాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. అయితే ప్రభాస్ రాధే శ్యామ్, చిరంజీవి ఆచార్య, విజయ్ లైగర్ సినిమాలు దెబ్బ కొట్టడంతో దారుణమైన పరిస్థితి ఏర్పడింది. జనవరి నెలలో బంగార్రాజుతో హిట్ దశ మొదలైంది. డిసెంబర్‌లో ధమాకా, 18 pagesలతో హిట్లు ముగిశాయి. డిసెంబర్ నెల చివరి వారంలో వచ్చిన టాప్ గేర్, లక్కీ లక్ష్మణ్, కొరమీనులతో నిరాశగా ముగిసింది. 

సంక్రాంతి సీజన్‌లో హీరో, రౌడీ బాయ్స్, బంగార్రాజు అంటూ ఇలా చాలా చిత్రాలే వచ్చాయి. కానీ నాగార్జున, నాగ చైతన్యలకే జనాలు ఓట్లు వేశారు. బంగార్రాజుతో హిట్లు మొదలయ్యాయి. అదే ఫిబ్రవరిలో చూసుకుంటే భీమ్లా నాయక్ పర్వాలేదనిపించింది. డీజే టిల్లు బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియాకు దారుణమైన కలెక్షన్లు వచ్చాయి. అసలు ఈ సినిమా గురించి చెప్పుకోవడం కూడా వేస్ట్ అన్నంతగా తీశారు

మార్చిలో అయితే ఆర్ఆర్ఆర్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది. రాధే శ్యామ్ బిగ్గెస్ట్ ఫ్లాపుగా నిలిచింది. ఆడవాళ్లు మీకు జోహార్లు సైతం బిలో యావరేజ్ అని టాక్ తెచ్చుకుంది. ఏప్రిల్‌లో వచ్చిన ఆచార్య చిత్రం దారుణాతి దారుణంగా టాక్ తెచ్చుకుంది. ఈ ఏడాది ఎక్కువ నష్టాలను తెచ్చిన చిత్రంగా నిలిచింది. వరుణ్ తేజ్ గని చిత్రం పరమరొటీన్‌గా వచ్చి డిజాస్టర్‌గా నిలిచింది.

మే నెలలో వచ్చిన ఎఫ్ 3 సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లు బాగానే వచ్చాయని నిర్మాతలు చెప్పుకొన్నారు. రాజశేఖర్ నటించి మలయాళీ రీమేక్ శేఖర్ సినిమా వచ్చినట్టు, పోయినట్టు ఎవ్వరికీ తెలియకుండా పోయింది. సర్కారు వారి పాటకు యావరేజ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం అదరగొట్టేశాయని నిర్మాతలు ప్రకటించుకున్నారు. ఇక విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాత్రం అందరినీ మెప్పించింది. శ్రీ విష్ణు భళా తందనాన ఫ్లాపుగానే నిలిచింది.

జూన్‌లో డబ్బింగ్ చిత్రాల సందడి ఎక్కువైంది. విక్రమ్, 777 చార్లీ బాగా ఆకట్టుకున్నాయి. అంటే సుందరానికీ, గాడ్సే, విరాట పర్వం, చోర్ బజార్, సమ్మతమే ఇలా ఎన్నో సినిమాలు వచ్చి బోల్తా కొట్టేశాయి. అడివి శేష్ మేజర్ ఒక్కటే హిట్‌గా నిలిచింది. రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, కిచ్చా సుదీప్ విక్రాంత్ రోణ, నాగ చైతన్య థాంక్యూ ఇలా అన్నీ ఫ్లాపులుగానే నిలిచాయి. రామ్ వారియర్ కూడా డిజాస్టర్‌గానే మిగిలింది. గోపీచంద్ పక్కా కమర్షియల్‌.. కమర్షియల్‌గానూ హిట్ అవ్వలేదు.

ఆగస్ట్‌లో మరుపురాని చిత్రాలు వచ్చాయి. నందమూరి కళ్యాణ్‌ బింబిసారా, దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ సీతారామం సినిమా క్లాసిక్‌గా నిలిచాయి. ఒకటి మాస్‌ను మెప్పిస్తే.. ఇంకోటి క్లాస్‌ను మెప్పించింది. నితిన్ మాచర్ల నియోజకవర్గం ఫ్లాప్ కాగా.. నిఖిల్ కార్తికేయ 2 ప్యాన్ ఇండియన్‌ మూవీగా నిలిచి వంద కోట్లకు పైగా కొల్లగొట్టేసింది. విజయ్ లైగర్, నాగ శౌర్య కృష్ణ వృందా విహారి, వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా, కిరణ్ అబ్బవరం నేను మీకు బాగా కావాల్సినవాడిని, సుధీర్ బాబు  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, శ్రీ విష్ణు అల్లూరి చిత్రాలు ఫ్లాపులుగా నిలిచాయి. ఒక శర్వానంద్ ఒకే ఒక జీవితం మాత్రం మంచి టాక్‌తో డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది.

అక్టోబర్ అంతా కూడా కాంతారా మయం అయింది. గాడ్ ఫాదర్ సినిమా కూడా ఆ దెబ్బకు వణికిపోయింది. ఆది క్రేజీ ఫెల్లో, మంచు విష్ణు జిన్నా దారుణాతి దారుణంగా బెడిసి కొట్టాయి. విశ్వక్ సేన్ ఓరి దేవుడా పర్వాలేదనిపించింది. బెల్లంకొండ గణేష్ అనుకోకుండా స్వాతిముత్యంతో బ్లాక్ బస్టర్ కొట్టేశాడు. నవంబర్‌లో సమంత యశోద, మసూద, ఊర్వశివో రాక్షసివో, గాలోడు, ఇట్లు మారెడుమిల్లి నియోజకవర్గం అన్నీ హిట్ అయ్యాయి. కానీ ఎక్కువ కలెక్షన్లు సాధించింది మాత్రం సమంత యశోదనే.

డిసెంబర్‌లో రవితేజ ధమాకా, 18 pages బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అయితే డిసెంబర్ చివరి వారం ఎంతో నిరాశజనకంగా మారింది. చివరి వారంలో ఆది టాప్ గేర్, సోహైల్ లక్కీ లక్ష్మణ్, కొరమీను సినిమాలు అన్నీ కూడా ఫ్లాపులుగానే మిగిలాయి. పెద్ద అంచనాలు లేకుండా ఈ చిత్రాలు రావడం, ఏ మాత్రం బజ్ లేకుండా రావడంతో ఈ సినిమాలు ఆకట్టుకోలేకపోయాయి. 

అయితే ఈ ఏడాది ఆది సాయి కుమార్, రాజ్ తరుణ్‌, శ్రీ విష్ణు, కిరణ్ అబ్బవరం వంటికి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. డబ్బింగ్ సినిమాల హవా మాత్రం చాలానే కనిపించింది. అదే సమయంలో కొన్ని దారుణాతి దారుణంగా బెడిసి కొట్టేశాయి. వలిమై, హే సినామిక, జేమ్స్, కణ్మణి ఖతీజా రాంబో, బీస్ట్, పొన్నియిన్ సెల్వన్, అక్షయ్ కుమార్ రామసేతు, శివ కార్తికేయన్ ప్రిన్స్, లాల్ సింగ్ చడ్డా, విశాల్ లాఠీలు బోల్తా కొట్టేశాయి. 777 చార్లీ, కేజీయప్‌ చాప్టర్ 2, విక్రమ్, సర్దార్, తిరు, కాంతారా వంటివి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

వచ్చే ఏడాది అయినా ఎలా ఉంటుందో చూడాలి. సంక్రాంతికి అయితే బాలయ్య చిరు విజయ్ అజిత్ పోటీ పడుతున్నాడు. చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీర సింహా రెడ్డిలో ఏది గెలుస్తుందో చూడాలి. వచ్చే ఏడాది ఏ ఏ హీరోలు హిట్లు కొడతారో వేచి చూడాలి.

Also Read: Dil Raju Shock: 'మైత్రీ'కి మరో షాకిచ్చిన దిల్ రాజు.. త్యాగమూర్తిని కాదంటూ కామెంట్స్!

Also Read: Prabhas on Kriti Sanon: కృతితో రిలేషన్ పై ఓపెన్ అయిపోయిన ప్రభాస్.. అసలు విషయం ఏంటంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News