Anasuya Bharadwaj: మీరు మగజాతి పరువు తీస్తున్నారు.. నెటిజన్‌పై మండిపడ్డ అనసూయ!

Anasuya Bharadwaj slams Netizen. అనసూయ భరద్వాజ్ తాజాగా ఓ నెటిజన్‌పై మండిపడ్డారు. 'దయచేసి మీరు మీ పనిని చూసుకోండి.. నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అని కౌంటర్ ఇచ్చారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2022, 02:42 PM IST
  • మీరు మగజాతి పరువు తీస్తున్నారు
  • నెటిజన్‌పై మండిపడ్డ అనసూయ
  • ఆ విషయంలో మీకు అవగాహన కల్పించాలి
Anasuya Bharadwaj: మీరు మగజాతి పరువు తీస్తున్నారు.. నెటిజన్‌పై మండిపడ్డ అనసూయ!

Anasuya Bharadwaj slams Netizen for commenting on her dressing: అనసూయ భరద్వాజ్.. ఈపేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈటీవీ కామెడీ షో 'జబర్దస్త్'తో బుల్లితెరకు పరిచమైన అనసూయ.. అనతి కాలంలోనే తన అందం, యాంకరింగ్‌తో బాగా పాపులర్ అయ్యారు. స్టార్ యాంకర్ అయిన అను ప్రస్తుతం బుల్లితెరపై మాత్రమే కాకుండా..  వెండితెరపై కూడా తన హవా కొనసాగిస్తున్నారు. సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికే పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మెప్పించిన అనసూయకి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.  

అనసూయ ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. దాంతో ఆమెకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రతివారం ప్రసారమయ్యే 'జబర్దస్త్' షో కోసం అనసూయ రకరకాల డ్రెసులతో పాటు చీర కట్టులోనూ మెరుస్తుంటారు. అందుకు సంబందించిన పోటోలను తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో పంచుకుంటారు. ఆ ఫొటోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.

తన పోటోల కారణంగా అనసూయకు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. అయితే తనపై ట్రోల్స్ వస్తే మాత్రం.. అను ఘాటుగా బదులిస్తుంటారు. తన గురించి ఎలాంటి తప్పుడు ప్రచారం జరిగినా.. వెంటనే స్పందించి ఘాటుగా రిప్లై ఇస్తుంటారు. తన డ్రెస్సింగ్‌ స్టైల్‌పై సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్‌ కామెంట్ చేయగా.. అను ఆయనకు ధీటుగానే బదులిచ్చారు. ఆపై ఓ వెబ్ సైట్ అనసూయ వయసుని తప్పుగా ప్రచారం చేయగా.. సదరు జర్నలిస్ట్‌పై ఫైర్ అయ్యారు. తాజాగా అను ఓ నెటిజన్‌పై మండిపడ్డారు. 

'అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా ఇలాంటి పొట్టిపొట్టి బట్టలు వేసుకుంటారా?. తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు' అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ ట్వీట్‌పై అనసూయ ఫైర్ అయ్యారు. 'దయచేసి మీరు మీ పనిని చూసుకోండి.. నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు' అని కౌంటర్ ఇచ్చారు. 'పెళ్లయి ఇద్దరు పిల్లలున్న హీరోలు షాట్స్ వేసుకోవడం లేదా?, టాప్ లెస్ సీన్స్ చేయట్లేదా? అని ఓ అను అభిమాని అడగ్గా.. 'ఇలాంటి వాటికి మీరెందుకు రెస్పాండ్ అవుతారు? టైం, ఎనర్జీ వేస్ట్' అని ఇంకో అభిమాని కామెంట్ చేశాడు. ఈ కామెంట్లపై స్పందించిన అనసూయ.. కొద్దిమంది మగవాళ్లు  తమ కుటుంబాల్లో, వారు పని ప్రదేశంలో సాధారణంగా స్త్రీలతో ఎలా ప్రవర్తించాలనే దానిపై అవగాహన కల్పించాలన్నారు. 

Also Read: Apsara Rani Hot Pics: అప్సర రాణి అందాల విందు.. రెడ్ డ్రెస్సులో బయటపడ్డ ఎద అందాలు!

Also Read: Telangana Weather Report: తెలంగాణకు వర్ష సూచన.. రాగల మూడు రోజుల్లో..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News