Samantha Tattoos: సమంత ఒంటిపై ఆ మూడు టాటూలు ఎక్కడ..టాటూలు ఎందుకు వద్దంటోంది

Samantha Tattoos: సమంత..టాలీవుడ్ అగ్ర నటి. పుష్ప సినిమాతో ప్రపంచమంతా ఊ అన్పించిన అందగత్తె. ఇప్పుడు అభిమానులకు సలహా ఇస్తోంది. ఎప్పుడూ టాటూ వేసుకోవద్దంటోంది. అసలా టాటూ కధేంటో తెలుసుకుందాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 18, 2022, 10:13 AM IST
  • సమంత ఒంటిపై ఉన్న ఆ మూడు టాటూలు ఎక్కడెక్కడున్నాయి
  • ఇప్పుడు టాటూలు వద్దే వద్దని ఎందుకు చెబుతోంది
  • యూత్‌‌కు సమంతా ఇచ్చే సందేశం వెనుక మర్మమేంటి
 Samantha Tattoos: సమంత ఒంటిపై ఆ మూడు టాటూలు ఎక్కడ..టాటూలు ఎందుకు వద్దంటోంది

Samantha Tattoos: సమంత..టాలీవుడ్ అగ్ర నటి. పుష్ప సినిమాతో ప్రపంచమంతా ఊ అన్పించిన అందగత్తె. ఇప్పుడు అభిమానులకు సలహా ఇస్తోంది. ఎప్పుడూ టాటూ వేసుకోవద్దంటోంది. అసలా టాటూ కధేంటో తెలుసుకుందాం..

టాలీవుడ్ అగ్రనటి సమంత..నాగచైతన్యతో విడాకుల అనంతరం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. అటు వార్తల పరంగా ఇటు సోషల్ మీడియా పరంగా హాట్ టాపిక్స్ ఎంచుకుంటూ ట్రెండింగ్‌లో ఉంటోంది. పుష్ప సినిమాలో ఊ అంటావా పాటతో ఇక ప్రపంచమంతా పాపులరైంది. ఇప్పుడు మరోసారి అభిమానులతో చిట్‌చాట్ సందర్భంగా ఆసక్తికర విషయాలు పంచుకుంది. 

ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మి ఎనీథింగ్ సెషన్‌లో భాగంగా అభిమానుల ప్రశ్నలకు బదులిచ్చింది. కొన్ని టాటూల్ని మీరు ఏదో ఒకరోజు ప్రేమిస్తారు కదూ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమంత నవ్వుతూనే స్పష్టంగా సమాధానమిచ్చింది. ఎప్పుడూ, ఎన్నడూ టాటూ వేసుకోవద్దని, ఎప్పటికీ వేసుకోద్దని స్పష్టం చేసింది. 

సమంత ఒంటిపై ఆ మూడు టాటూలు ఎక్కడ

సమంత ఒంటిపై ఇప్పటికే మూడు టాటూలున్నాయి. ఒకటి సమంత మెడ కింద వెనుకభాగంలో వైఎంసీ అని ఉంది. అంటే ఏం మాయ చేశావే అని అర్ధం. రెండవ టాటూ ఆమె కుడివైపు రిబ్స్‌పై ఉంది. చే అని రాసుంది. ఇక మూడవది చాలా ప్రత్యేకం. సమంత, నాగచైతన్యలిద్దరూ మోచేతిపై రెండు బాణాలు గుర్తులు వేసుకున్నారు. 

సమంత మెస్సేజ్ ఇదే

యువతకు ముఖ్యంగా మహిళలకు మీరిచ్చే సందేశమేంటని అడిగినప్పుడు సమంత స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. నీపై నీవెప్పుడు సందేహపడవద్దు..ఇతరులు నిన్నెప్పుడూ సందేహపడేలా చేయవద్దు.. నీవు బాగాలేదని ఇతరులు చెప్పే పరిస్థితి తెచ్చుకోవద్దు, నీ కలల్ని నీవు ఫాలో కావాలి, ఎప్పుడూ గిల్ట్ ఫీలవద్దు అని స్పష్టం చేసింది. 

పిట్నెస్ విషయంలో సమంత ఎప్పుడూ అందరికంటే భిన్నంగా ఉంటుంది. మిగిలినవారితో పోలిస్తే చాలా ఫిట్‌గా ఉంటుంది. ఇతరులు కూడా ఆమెలోని ఇదే అంశాన్ని ప్రశంసిస్తారు. జిమ్‌లో బాడీని ఫిట్‌గా ఉంచుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఈ జానూ బ్యూటీ సమంత..వర్కవుట్ వీడియోలతో తరచూ హల్‌చల్ చేస్తుంటోంది. ఫిట్నెస్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. వెయిట్ లిఫ్ట్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. జిమ్‌లో సమంత బీస్ట్ మోడ్‌లో కూడా కన్పిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రతియేటా ఫిజికల్‌గా ఎవర్ ఫిట్‌గా ఉంటోంది సమంత. అంతేకాదు తన ఫిట్నెస్ ప్లాన్స్ కూడా షేర్ చేసుకుంది. స్ట్రాంగ్ బాడీ, స్ట్రాంగర్ మైండ్..2022-23 ఏడాది ఫిజికల్‌గా డిమాండింగ్, ఛాలెంజింగ్ సమయమంటోంది. 

Also read: Chiranjeevi Acharya: స్టెప్పులతో ఇరగదీసిన చిరు- చరణ్‌.. 'భలే భలే బంజారా' సాంగ్ ప్రోమో అదుర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News