Brahmaji Drinking Party : మందు పార్టీ.. ఫుల్ చిల్ అవుతున్న డైరెక్టర్లు.. బ్రహ్మాజీ చేతిలో బీరు!

Brahmaji Drinking Party టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ఆయన ఇంట్లో మందు పార్టీ చేసుకుంటూ దిగిన ఫోటోను షేర్ చేశాడు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2023, 02:01 PM IST
  • టాలీవుడ్‌లో మందు పార్టీ సందడి
  • బ్రహ్మాజీ ఇంట్లో దర్శకుల మీటింగ్
  • నటుడు చేతిలో మందు.. పిక్ వైరల్
Brahmaji Drinking Party : మందు పార్టీ.. ఫుల్ చిల్ అవుతున్న డైరెక్టర్లు.. బ్రహ్మాజీ చేతిలో బీరు!

Brahmaji Drinking Party టాలీవుడ్‌లో నటుడు బ్రహ్మాజికి కమెడియన్‌గా, విలన్‌గా ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఒకప్పటి తరానికి అయితే విలన్‌గా సుపరిచితుడు. ఇప్పటి తరానికి మాత్రం బ్రహ్మాజి అంటూ మంచి కమెడియన్. ఎలాంటి పాత్రల్లోనైనా నటించి నవ్వించగలడు. మెప్పించగలడు. అలాంటి బ్రహ్మాజీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. నెటిజన్లను నవ్వించేందుకు ఆయన వేసే ట్వీట్లు ఒక్కోసారి కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి.

మొన్నటికి మొన్న రోజా చేసిన కామెంట్ల మీద కౌంటర్లు వేశాడు. మెగా ఫ్యామిలీకి భయపడి వారికి మద్దతుగా నిలుస్తారంటూ పరోక్షంగా హైపర్ ఆది మీద సెటైర్లు వేసింది రోజా. అయితే దీనిపై బ్రహ్మాజి కౌంటర్లు వేశాడు. మెగా ఫ్యామిలీ ఎప్పుడూ కూడా నాకు ఏం చేయలేదు.. సపోర్ట్ చేయమని అడగలేదు కూడా.. మరి నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నాను అంటూ రోజాకు కౌంటర్లుగా బ్రహ్మాజీ ట్వీట్ వేశాడు.

అలా బ్రహ్మాజీ వేసే ట్వీట్లు, పెట్టే కామెంట్లు ఎక్కువగా వివాదాలకు దారి తీస్తుంటాయి. తాను సంపాదించే డబ్బుని కూడా ఎక్కువగా దాచి పెట్టుకోడట. తనకు ప్రపంచ పర్యటన అంటే ఇష్టమని, తన భార్యతో కలిసి విదేశాలు చుట్టి వచ్చేందుకే డబ్బంతా కూడా ఖర్చు పెడతాను అంటూ బ్రహ్మాజీ చెబుతుంటాడు.

 

ఇప్పుడు బ్రహ్మాజీ ఓ ట్వీట్ వేశాడు. అందులో తన చేతిలో మందు కనిపిస్తోంది. మందు పార్టీ ఇచ్చినట్టుగా, తన ఇంట్లో ఇలా డైరెక్టర్లంతా మీట్ అయినట్టుగా చెప్పుకొచ్చాడు. ఈ దర్శకుల్లో హను రాఘవపూడి, సుధీర్ వర్మ, శివ నిర్వాణ వంటి వారు కనిపించారు. ఈ ఫోటో మీద జనాలు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కారెక్టర్లు ఇవ్వమని కాకాపడుతున్నావా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ ఓ పిట్ట కథ అనే సినిమాతో హీరోగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్స్‌ను బ్రహ్మాజీ తన భుజానికి ఎత్తుకున్న సంగతి తెలిసిందే.

Also Read:  Jamuna Death : జమున మరణం.. చిరు, బాలయ్య, పవన్ సంతాపం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్

Also Read: KGF Vasishta Wedding : నాని హీరోయిన్‌ను పెళ్లాడిన కేజీయఫ్ నటుడు వశిష్ట.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News