Tollywood Box Office Report: టాలీవుడ్ 3 నెల‌ల‌ బాక్సాఫీస్ రిపోర్ట్... హనుమాన్, టిల్లు సహా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు ఇవే..

Tollywood 3 Months Box Office Report: చూస్తూ చూస్తేనే 2024లో మూడు నెల‌లు కంప్లీట్ అయ్యాయి. ఈ 3 మంత్స్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎన్నో సినిమాలు విడుద‌లై త‌మ ల‌క్‌ను ప‌రీక్షించుకున్నాయి. అందులో హ‌నుమాన్, తాజాగా టిల్లు స్వ్కేర్ సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్స్‌గా నిలిచాయి. మొత్తంగా 3 నెల‌ల్లో సిల్వ‌ర్ స్క్రీన్‌ను షేక్ చేసిన సినిమాల విష‌యానికొస్తే..

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 2, 2024, 12:31 PM IST
Tollywood Box Office Report: టాలీవుడ్ 3 నెల‌ల‌ బాక్సాఫీస్  రిపోర్ట్... హనుమాన్, టిల్లు సహా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమాలు ఇవే..

Tollywood 3 Months Box Office Report: 2024లో మూడు నెల‌లు కంప్లీట్ చేసుకుంది. ఈ క్వాట‌ర్లీ ఎగ్జామినేష‌న్‌లో టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ ద‌గ్గర త‌మ ల‌క్‌ను ప‌రీక్షించుకున్నాయి. అందులో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌తో పాటు కొన్ని లో బ‌డ్జెట్ మూవీస్ ప్రేక్ష‌కుల తీర్పు కోసం థియేట‌ర్స్‌లో రిలీజ‌య్యాయి. అందులో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర విజ‌యం సాధించిన  చిత్రాలు బొక్క‌బోర్లా ప‌డ్డ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం..

Also Read: Pregnant Woman Tips: సమ్మర్ లో గర్భిణీలు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి..

2024లో జ‌న‌వ‌రి 1న సర్కారి నౌక‌రి సినిమాతో టాలీవుడ్  బాక్సాఫీస్ బోణి కొట్టింది. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. ఆ త‌ర్వాత రాఘ‌వ‌రెడ్డి, ప్రేమ‌క‌థ‌, డ‌బుల్ ఇంజిన్ వంటి పలు చిత్రాలు వ‌చ్చినా... ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి.

ఈ సినిమాల త‌ర్వాత సంక్రాంతి చిత్రాల సంద‌డి మొద‌లైంది.  ఈ సారి బ‌రిలో హ‌నుమాన్, మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్‌ల గుంటూరు కారం, సినిమాలు జ‌వ‌న‌రి 12న విడుద‌ల‌య్యాయి. ఇందులో ప్ర‌శాంత్ వ‌ర్మ్ ద‌ర్శ‌క‌త్వంలో తేజ్ స‌జ్జ హీరోగా హ‌నుమాన్ మూవీ ప్యాన్ ఇండియా లెవ‌ల్లో  బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఘ‌న విజ‌యం సాధించింది. మ‌న దేశంలోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న తొలి చిత్రంగా రికార్డుల‌కు ఎక్కింది. మ‌రోవైపు మ‌హేష్ బాబు గుంటూరు కారం సినిమా తొలి రోజు రికార్డు బ్రేక్ క‌లెక్ష‌న్స్ సాధించింది. చివ‌ర‌కు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అబౌ యావ‌రేజ్‌గా నిలిచింది. అటు జ‌న‌వ‌రి 13న వెంక‌టేష్ సైంధ‌వ్ మూవీ ప్రేక్ష‌కుల తిర‌స్క‌ర‌ణ‌కు గురైంది. శైలేష్ కొల‌ను దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. అటు నాగార్జున హీరోగా న‌టించిన నా సామి  రంగా చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి ఫ‌లితాన్నే అందుకుంది. ఈ సినిమాతో కొరియోగ్రాఫ‌ర్ విజ‌య్ బిన్ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య్యారు.

సంక్రాంతి పండ‌గ త‌ర్వాత వారంలో పెద్ద‌గా ఏ సినిమాలు రిలీజ్ కాలేదు. జ‌న‌వ‌రి లాస్ట్ వీక్‌లో ధ‌నుశ్ కెప్టెన్ మిల్ల‌ర్ మూవీతో ప‌ల‌క‌రించారు. ఈ సినిమా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. అటు శివ‌కార్తికేయ‌న్ అల‌యాన్ చివ‌రి నిమిషంలో ఆర్ధిక ఇబ్బందుల కార‌ణంగా రిలీజ్ కాలేక‌పోయింది.
సాధారణంగా ఫిబ్ర‌వ‌రి చిత్ర సీమ‌కు అన్ సీజ‌న్ పిల్లకు పరీక్షలు సీజన్ కావడంతో బడా హీరోల చిత్రాలను ఈ సీజన్‌లో విడుదల చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టరు. గత కొన్నేళ్లుగా ఫిబ్రవరిలో విడుదలైన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధిస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన 'టెంపర్', భీమ్లా నాయక్, ఉప్పెన, జాంబిరెడ్డి, నాంది వంటి చిత్రాలు ఈ అన్‌సీజన్‌లో విడుదలై మంచి విజయాలనే అందుకున్నాయి. ఈ సారి మాత్రం ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో సుహాస్ హీరోగా నటించిన 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు', కిస్మత్, హ్యాపీ ఎండింగ్, బూట్ కట్ బాలరాజు వంటి పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర తమ లక్‌ను పరీక్షించుకున్నాయి. ఇందులో 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' పర్వాలేదనపించింది.

ఫిబ్రవరి నెల విషయానికొస్తే..
ఇక ఫిబ్రవరి సెకండ్ వీక్‌లో 'యాత్ర 2' మూవీకి మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం రాలేదు. అటు రవితేజ 'ఈగల్‌' మూవీ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనపించింది. అటు రజినీకాంత్ హీరోగా నటించిన 'లాల్ సలాం' సినిమా విడుదలైన సంగతే తెలియదు. ఈ సినిమా ఘోరాతి ఘోరంగా డిజాస్టర్‌గా నిలిచింది. మూడో వారంలో సందీప్ కిషన్ 'ఊరి పేరు భైరవకోన' సినిమా మాత్రం కాస్తంత పర్వాలేదనిపించింది. అటు మమ్ముట్టి 'భ్రమయుగం' సినిమాకు ప్రశంసలు దక్కినా.. కాసులు మాత్రం దక్కలేదు.
అటు ఈ మంత్‌తో 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా', రాజధాని ఫైల్స్, సిద్దార్ధ్ రాయ్, చిత్రాలు విడుదలై పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి.

మార్చి నెల విషయానికొస్తే..

తెలుగులో సమ్మర్ సీజన్ మార్చి నుంచే షురూ అవుతోంది. ఈ నెల మొదటి వారంలో వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్'తో 'భూతద్దం భాస్కర్ నారాయణ', వెన్నెల కిషోర్ 'చారి 111', ఇంటి నంబర్ 13, ఆర్జీవి వ్యూహం  వంటి చిత్రాలు ప్రేక్షకుల తీర్పు కోరి థియేటర్స్‌లో విడుదలయ్యాయి. ఇందులో ఏ సినిమా పెద్దగా అలరించలేకపోయింది. ఆ మరుసటి వారంలో విశ్వక్ సేన్ 'గామి' సినిమాతో హిట్ అందుకున్నాడు. అటు గోపీచంద్ 'భీమా'తో నిరాశ పరిచాడు. అటు మలయాళ అనువాద చిత్రం 'ప్రేమలు' తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక మార్చి మూడో వారంలో 'రజాకార్', 'లంబసింగి', షరతులు వర్తిస్తాయి, వెయి దరువేయ్ వంటి పలు చిత్రాలు పలకరించాయి. అందులో రజాకార్ సినిమాకు మంచి పేరు వచ్చినా.. పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. లాస్ట్ ఇయర్ 'సామజవరగమన' సినిమాతో హిట్ అందుకుని జోష్‌లో ఉన్న శ్రీ విష్ణు.. 'ఓం భీమ్ బుష్' సినిమాతో ప్రేక్షకులను నవ్వించాడు. బాక్సాఫీస్ దగ్గర మరో హిట్ అందుకున్నాడు.

మార్చి చివరి వారంలో డీజే టిల్లు మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన 'టిల్లు స్క్వేర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర దడదడ లాడిస్తూ మంచి ఎండింగ్ ఇచ్చింది. సిద్దు జొన్నలగడ్డ కథ మాటలు అందించిన ఈ సిన సినిమాకు మల్లిక్ రామ్ దర్శకుడు. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'టిల్లు 3'ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ సినిమాకు ఒక రోజు ముందు పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన 'ఆడు జీవితం' గోట్ లైఫ్ మూవీ విడుదలై విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. బ్లెస్సీ డైరెక్ట్ చేసాడు. ఈ సినిమా తెలుగులో ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. మరి ఏప్రిల్ నెలలో ఫ్యామిలీ స్టార్ సహా పలు చిత్రాలు సమ్మర్ ను కూల్ చేయడానిక ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఏయే చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుని సమ్మర్‌కు మంచి ఎండింగ్ ఇస్తాయనేది చూడాలి.

Also Read: AP Pensions: ఏపీ ప్రజలకు భారీ షాక్.. ఇకపై ఇంటింటికి పథకాలు రావు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitterసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News