Shriya Saran Baby Bump: వైరల్ వీడియో.. బేబీ బంప్‌తో శ్రియా సరన్‌ డాన్స్‌!

Shriya Saran Baby Bump Video. శ్రియా బేబీ బంప్‌తో డాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చుసిన అందరూ శ్రియా మళ్లీ ప్రెగ్నెంటా? అని ఆశ్చర్యపోతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 21, 2022, 10:11 PM IST
  • బేబీ బంప్‌తో శ్రియా సరన్‌
  • లాక్డౌన్ సమయంలో గర్భవతి
  • ఆండ్రీ కోస్చీవ్‌‌ని రహస్యంగా పెళ్లి
Shriya Saran Baby Bump: వైరల్ వీడియో.. బేబీ బంప్‌తో శ్రియా సరన్‌ డాన్స్‌!

Tollywod Actress Shriya Saran Baby Bump Video goes viral: శ్రియా సరన్‌.. ఈపేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగారు. 'ఇష్టం' సినిమాతో  ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రియా అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయ్యారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున, నటసింహం బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, లవర్ బాయ్ తరుణ్ లాంటి హీరోలతో జతకట్టారు. 

బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రియా.. చాలా గ్యాప్ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌లో కనిపించారు. 2018 సంవత్సరంలో రష్యాకు చెందిన ఆండ్రీ కోస్చీవ్‌‌ని రహస్యంగా పెళ్లిచేసుకున్న శ్రియా ఆపై సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. పెళ్లి విషయం కూడా ఎవరికీ చెప్పలేదు. ఇక గర్భవతి అయిన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిన శ్రియా.. గతేడాది అక్టోబర్‌లో కూతురు పుట్టిందని ప్రకటించి అందరికి పెద్ద షాక్ ఇచ్చారు. 

ఇటీవలి కాలంలో శ్రియా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉన్నారు. నిత్యం నెట్టింట రొమాంటిక్ అప్‌డేట్స్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ క్రమంలో శ్రియా బేబీ బంప్‌తో డాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చుసిన అందరూ శ్రియా మళ్లీ ప్రెగ్నెంటా? అని ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇది పాత వీడియో. 2020లో బేబీ బంప్‌తో డాన్స్ చేస్తున్న వీడియో అది. మొదటి లాక్డౌన్ సమయంలో గర్భవతి అయిన శ్రియా.. తాజాగా ప్రెగ్నెంట్ వీడియోను పంచుకున్నారు.  

గమనం సినిమా ప్రమోషన్స్‌కు శ్రియా తన భర్త, పాపతో కలిసి వచ్చారు. ఆ సందర్భంగా ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం మాతృత్వ మధురిమల్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్‌లో మెరిసిన శ్రియా.. 'మ్యూజిక్ స్కూల్' షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ గోవాలో జరుగుతుంది.

Also Read: MI vs CSK: ఐపీఎల్‌లో ఆ రెండు జట్ల పోరు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను తలపిస్తుంది.. హర్భజన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Also Read: Netflix Subscribers: భారీ నష్టాల్లో నెట్‌ఫ్లిక్స్.. అసలు కారణాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News