BB 7 Telugu: బిగ్‌బాస్‌లో ఈ సారి భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..లిస్టులో ఎవరున్నారంటే?

Bigg Boss 7 Telugu: తక్కువ మంది కంటెస్టెంట్లతోనే షో పై ఆసక్తిని పెంచేశాడు బిగ్ బాస్. అయితే ఈసారి బిగ్ బాస్ లో భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇలా జరగడం బిగ్‌బాస్‌ హిస్టరీలోనే తొలిసారి. మరి హౌస్ లోకి ఎవరెవరు రానున్నారంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 21, 2023, 06:58 PM IST
BB 7 Telugu: బిగ్‌బాస్‌లో ఈ సారి భారీగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..లిస్టులో ఎవరున్నారంటే?

BB 7 Telugu, Wild Card Entries: పాపులర్ రియాల్టీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 07 విజయవంతంగా నడుస్తోంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుని మూడో వారంలో అడుగుపెట్టింది బిగ్ బాస్. హౌస్ లోకి 14 కంటెస్టెంట్లు వెళ్లగా.. ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం హౌజ్ లో 12 మంది మాత్రమే ఉన్నారు. ఉల్టాపుల్టా అంటూ షో ప్రారంభంలోనే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లోకి అడుగుపెట్టిన వారంతా జస్ట్‌ కంటెస్టెంట్స్‌ మాత్రమేనని.. హౌస్ మేట్స్ ఇంకా కాలేదన్నాడు పెద్దయ్య. పవర్‌ అస్త్ర గెలిచిన వారే హౌస్ మేట్స్ అవుతారని పిటింగ్ పెట్టాడు. కేవలం ఇప్పటి వరకు ఆట సందీప్, శివాజీ మాత్రమే హౌస్ మేట్స్ అయ్యారు. ఇక మూడో పవరాస్త్రం కోసం ప్రిన్స్ యావర్, శోభాశెట్టి, అమర్ దీప్ పోటీలో ఉన్నారు.  

ఇంతకముందు సీజన్స్ లో 20కు పైగా కంటెస్టెంట్లు హౌస్ లోకి అడుగు పెట్టేవారు. అయితే ఈ సీజన్‌లో కేవలం 14 మంది మాత్రమే ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఇద్దరూ ఇప్పటికే వెళ్లిపోయారు. దీంతో షో ఇంకా రక్తి కట్టాలంటే మరికొంత మంది కంటెస్టెంట్లు అవసరం. ఇంతక ముందు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ల ద్వారా ఒకరు లేదా ఇద్దరు హౌస్ లోకి వచ్చారు. కానీ ఈ సారి భారీగా వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. మొత్తం 5 గురు సెలబ్రిటీలు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి రాబోతున్నారని తెలుస్తోంది. వీరిలో జబర్దస్త్ నరేష్, సీరియల్‌ ఆర్టిస్ట్‌ అంబటి అర్జున్‌, పూజా మూర్తి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. 

ఇటీవలే ఆస్ట్రేలియా టూర్‌ పూర్తి చేసుకుని వచ్చిన నరేష్ హౌస్ లోకి రావడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు అన్నం పెట్టిన  జబర్దస్త్‌ షోను వదిలి నరేష్ బిగ్‌బాస్‌కు వస్తాడా లేదో చూడాలి. ఇప్పటికే సీరియల్ నటి పూజా మూర్తి హౌస్ లోకి రావాల్సి ఉంది. కానీ ఆమె తండ్రి హఠాన్మరణంతో రాలేకపోయారు.  ఇప్పుడు ఈమె వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. సీరియల్‌ ఆర్టిస్ట్‌ అంబటి అర్జున్‌ బిగ్ బాస్ లోకి వెళ్లబోతున్నట్లు హింట్స్ ఇస్తున్నాడు. వీరితోపాటు మరికొంత మంది హౌస్ లోకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు.

Also Read: Bigg Boss 7 Telugu: చికెన్ తినలేక చతికిలపడిన శోభా.. ఆమె స్థానంలో రేసులోకి ఆ ముగ్గురు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News