The Raja Saab First Glimse: ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్.. ‘ది రాజా సాబ్’ ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఖరారు..

The Raja Saab First Glimse: రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న ప్రభాస్.. తన నెక్ట్స్  మూవీకి ‘ది రాజా సాబ్’ మూవీకి సంబంధించిన బిగ్ అప్డేట్ ఇచ్చాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 28, 2024, 01:21 PM IST
The Raja Saab First Glimse: ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే అప్డేట్.. ‘ది రాజా సాబ్’ ఫస్ట్ గ్లింప్స్ కు ముహూర్తం ఖరారు..

The Raja Saab First Glimse: ‘బాహుబలి’ సిరీస్ తో ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అంతేకాదు వరుసగా ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ మూవీస్ చేస్తున్నాడు. తాజాగా ‘కల్కి’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ. 1100 కోట్లకు పైగా కొల్లగొట్టాడు ప్రభాస్. బాహుబలి 2 తర్వాత రూ. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన రెండో చిత్రంగా ‘కల్కి’ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’  మూవీ చేస్తున్నారు. ఒకవైపు ‘సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం’ సినిమా చేస్తూనే ఈ సినిమాకు డేట్స్ కేటాయించాడు ప్రభాస్.

ఆగష్టులో ‘ది రాజాసాబ్’ మూవీలో తన పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను రేపు ఇవ్వనున్నాడు. ‘ది రాజా సాబ్’ ఫస్ట్ గ్లింప్స్ ను సోమవారం (29-7-2024) రోజు సాయంత్రి 5 గంటల 3 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఫస్ట్ గ్లింప్స్ తో పాటు ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాను హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఆత్మ పాత్రలో కనిపించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

దర్శకుడిగా మారుతి ట్రాక్ రికార్డు ఏ మాత్రం బాగాలేపోయినా.. తను చెప్పిన లైన్ నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ అభిమానులు కోరుకునే మాస్ డాన్సలు కూడా ఓ రేంజ్ లో ఉండనున్నాయి.  ఈ సినిమాలో రెబల్ స్టార్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్దీ కుమార్ నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు ప్రభాస్.. వరుసగా మంచు విష్ణు.. కన్నప్పతో పాటు సలార్ పార్ట్ 2, స్పిరిట్, ఫౌజీ, సిద్ధార్ధ్ ఆనంద్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. మొత్తంగా ప్రభాస్.. అభిమానులకు మాట ఇచ్చినట్టే యేడాదికి రెండేసి సినిమాలో పలకరించడం చూసి ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు.

ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..

ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News