Rashmika Mandanna: త‌న‌ బాయ్​ఫ్రెండ్‌ ఎవరో చెప్పేసిన రష్మిక మందన్నా, వీడియో వైరల్

The Girlfriend: యానిమ‌ల్ సక్సెస్ తో వరుస సినిమాలను పట్టాలెక్కిస్తుంది నేషనల్ క్రష్ రష్మిక. ఈమె లేటెస్ట్ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్‌'. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నుంచి సాలిడ్ అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2023, 12:51 PM IST
Rashmika Mandanna: త‌న‌ బాయ్​ఫ్రెండ్‌ ఎవరో చెప్పేసిన రష్మిక మందన్నా, వీడియో వైరల్

The Girlfriend Movie Update: యానిమ‌ల్ విజయంతో మాంచి జోష్ ఉంది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna). ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో రెండు చిత్రాలు ఉన్నాయి. అవే 'పుష్ప' మరియు 'ది గర్ల్‌ఫ్రెండ్‌'. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. అల్లుఅర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప2 షూటింగ్ జోరుగా సాగుతోంది. ఇందులో శ్రీవల్లీగా అలరించేందుకు మరోసారి రెడీ అయింది రష్మిక. మరోవైపు గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న 'ది గర్ల్‌ఫ్రెండ్‌' (The GirlFriend)’ అనే చిత్రంలోనూ నటిస్తోంది. ఈ మూవీకి హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ (Rahul Ravindran) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. తాగాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. 

‘'ది గర్ల్‌ఫ్రెండ్‌'’ మూవీలో తన బాయ్​ఫ్రెండ్‌ను ప‌రిచ‌యం చేసింది రష్మిక. అతడు మరెవరో కాదు నాని దసరా సినిమాలో నటించిన దీక్షిత్ శెట్టి. కన్నడలో ఇతడు నటించిన దియ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. దీక్షిత్ శెట్టి బర్త్​డే సందర్భంగా చిత్రయూనిట్ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది. అందులో ‘గర్ల్​ఫ్రెండ్​కు తగిన బాయ్​ఫ్రెండ్ ఇతడే అంటూ రాసుకొచ్చింది చిత్రబృందం. 

Also read: Vyooham: బెజవాడ ముద్దుబిడ్డ వర్మ ..వనికిపోయిన టిడిపి…వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రోజా

అందాల రాక్షసి సినిమాతో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రవీంద్రన్. ఆ తర్వాత అలా ఎలా, హౌరా బ్రిడ్జ్, హైదరాబాద్ లవ్ స్టోరీ, యూ టర్న్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు. మహేశ్ బాబు హీరోగా నటించిన శ్రీమంతుడులో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. అయితే ఆ తర్వాత మెగాఫోన్ చేతబట్టి చి.ల‌.సౌ (Chi la Sow) సినిమాతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ రాహుల్ విజయాన్ని అందించడంతోపాటు అనేక అవార్డులను కూడా తీసుకొచ్చింది.  ఈ సినిమాకు గాను రాహుల్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డు అందుకున్నాడు. అయితే ఇతడు ఆ తర్వాత నాగార్జునతో తెరకెక్కించిన మన్మథుడు 2 బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ల్యాంగ్ గ్యాప్ తర్వాత ది గ‌ర్ల్‌ఫ్రెండ్‌ మూవీతో వస్తున్నాడు రాహుల్. 

Also read: Salaar : టాలీవుడ్ కి మరో రమ్యకృష్ణ.. శ్రియా రెడ్డికి ఫ్యాన్స్ ఫిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News