The Ghost Vs God Father: గాడ్ ఫాదర్ తో పోటీలో ఓడిపోయిన ది ఘోస్ట్.. దారుణంగా నాగార్జున సినిమా వసూళ్లు!

The Ghost Vs God Father 2 Days Collections: గాడ్ ఫాదర్ సినిమాతో పాటు నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా దసరాకు విడుదలైంది. కానీ ఈ సినిమా వసూళ్లు దారుణంగా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 7, 2022, 03:33 PM IST
The Ghost Vs God Father: గాడ్ ఫాదర్ తో పోటీలో ఓడిపోయిన ది ఘోస్ట్.. దారుణంగా నాగార్జున సినిమా వసూళ్లు!

The Ghost Vs God Father 2 Days Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ సినిమా, కింగ్ నాగార్జున హీరోగా ది ఘోస్ట్ సినిమాలు దసరా కానుక అక్టోబర్ 5వ తేదీన విడుదలయ్యాయి. అయితే మునుపెన్నడూ లేని విధంగా ఈ ఇద్దరు సన్నిహిత హీరోల సినిమాలు ఇలా విడుదలవుతున్న సమయంలో రెండు పోటాపోటీగా ఉంటాయని అందరూ భావించారు. కానీ మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా ముందు నాగార్జున ది ఘోస్ట్ సినిమా నిలబడలేక పోతోంది. నిజానికి గాడ్ ఫాదర్ సినిమాతో పాటు ఘోస్ట్ సినిమాకి కూడా మంచి టాక్ వచ్చింది.

అయితే గాడ్ ఫాదర్ సినిమాకి ఉన్నంత క్రేజ్ ఘోస్ట్ సినిమాకి లేకపోవడంతో గాడ్ ఫాదర్ సినిమాకి వసూళ్ల వర్షం కురుస్తోంది. మొదటి రోజు సుమారు 13 కోట్ల దాకా షేర్ వసూళ్లు రాబట్టిన గాడ్ ఫాదర్ సినిమా రెండవ రోజు కూడా అదే జోరు చూపిస్తూ సుమారు ఏడు కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం సరిగ్గా పెర్ఫాం చేయలేకపోతోంది. ఆయన హీరోగా నటించిన ఘోస్ట్ సినిమా మొదటి రోజు రెండు కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రాబట్టగా రెండో రోజు 76 లక్షలు వసూళ్లు రాబట్టింది.

మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రెండు రోజులకు కేవలం మూడు కోట్ల 36 లక్షల షేర్ వసూళ్లు మాత్రమే రాబట్టగలిగింది. అదే  గాడ్ ఫాదర్ సినిమా మాత్రం రెండు రోజుల్లో సుమారు 27 కోట్ల 35 లక్షల దాకా షేర్ రాబట్టింది. గాడ్ ఫాదర్ సినిమాను మోహన్ రాజా డైరెక్ట్ చేయగా ఎన్వి ప్రసాద్, ఆర్బి చౌదరి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో ఆయన కాకుండా సల్మాన్ ఖాన్, నయనతార, సునీల్, అనసూయ భరద్వాజ్, మురళీ శర్మ వంటి వారు ఇతర కీలక పాత్రలలో కనిపించారు.

ఇక ది ఘోస్ట్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్ మరార్ నిర్మించారు. ఇక ఈ సినిమాకు ప్రవీణ్ సత్తార్ డైరెక్టర్ గా వ్యవహరించారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో గుల్ పనాగ్, నాగార్జున సోదరి పాత్రలో కనిపించారు. ఇక నాగ్ మేనకోడలు పాత్రలో అనికా సురేంద్రన్ కనిపించారు. ఇక రెండు సినిమాల మధ్య తేడా ఎంత అనేది ఇప్పుడు కింది టేబుల్ లో చూద్దాం.

ది ఘోస్ట్ - 2 రోజులు  గాడ్ ఫాదర్- 2 రోజులు
నైజాం : 81 లక్షలు నైజాం: 5.67 కోట్లు
సీడెడ్ : 38 లక్షలు సీడెడ్: 5.14 కోట్లు
ఉత్తరాంధ్ర : 47 లక్షలు ఉత్తరాంధ్ర: 2.27 కోట్లు
ఈస్ట్ గోదావరి: 28 లక్షలు  ఈస్ట్ గోదావరి: 2.11 కోట్లు
వెస్ట్ గోదావరి: 12 లక్షలు వెస్ట్ గోదావరి: 1.04 కోట్లు
గుంటూరు : 28 లక్షలు గుంటూరు: 2.35 కోట్లు
కృష్ణ : 24 లక్షలు కృష్ణా: 1.22 లక్షలు
నెల్లూరు : 18 లక్షలు నెల్లూరు: 90 లక్షలు
ఆంధ్ర ప్రదేశ్ -తెలంగాణ : 2.76 కోట్లు షేర్ (5.05 కోట్లు గ్రాస్)  ఆంధ్ర ప్రదేశ్ -తెలంగాణ :20.70 కోట్లు (34.75కోట్ల గ్రాస్)
కర్ణాటక + ఇండియా (2 రోజులు) : 25 లక్షలు కర్ణాటక +ఇండియా(2 రోజులు) : 2.30 కోట్లు+ హిందీ:1.80 కోట్లు
ఓవర్సేస్ : 35 లక్షలు  ఓవర్సేస్:  2.55  కోట్లు

ది ఘోస్ట్ప్ర పంచవ్యాప్తంగా:          

3.36 కోట్లు ( 6.35 కోట్లు గ్రాస్)  

 గాడ్ ఫాదర్ ప్రపంచ వ్యాప్తంగా : (2 రోజులు) కలిపి

 27.35 కోట్లు  (50.35 కోట్లు గ్రాస్)

Also Read: Akhanda Vs God Father: రెండో రోజు ఊపందుకున్న గాడ్ ఫాదర్.. ఎట్టకేలకు అఖండను బీట్ చేసేసిందిగా!

Also Read: Garikapati with Chiranjeevi: మెగా ఫాన్స్ ఆగ్రహం.. చిరంజీవితో మాట్లాడతా, అందరికీ చెప్పండి..లైవ్లోనే గరికపాటి క్లారిటీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News