Thalaivi Telugu trailer: జయలలిత బయోపిక్ తళైవి ట్రైలర్ వచ్చేసింది

Thalaivi Telugu trailer: తమిళనాడు దివంగత సీఎం జయలలిత రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ తళైవి ట్రైలర్ వచ్చేసింది. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ బయోపిక్‌లో బాలీవుడ్ నటి Kangana Ranaut టైటిల్ రోల్ జయలలిత పాత్రలో కనిపించనుంది. Thalaivi trailer జయలలిత బయోపిక్‌పై అంచనాలు పెంచింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2021, 02:46 PM IST
  • తమిళనాడు దివంగత సీఎం Jayalalitha real story ఆధారంగా తెరకెక్కుతున్న తళైవి.
  • విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ బయోపిక్‌ మూవీలో జయలలిత పాత్రలో బాలీవుడ్ నటి Kangana Ranaut.
  • జయలలిత సినిమా హీరోయిన్ నుంచి సీఎం స్థాయికి ఎలా ఎదిగారనేది Thalavi Trailer ‌లో ప్రస్తావించిన డైరెక్టర్ విజయ్.
Thalaivi Telugu trailer: జయలలిత బయోపిక్ తళైవి ట్రైలర్ వచ్చేసింది

Thalaivi Telugu trailer: తమిళనాడు దివంగత సీఎం జయలలిత రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ తళైవి ట్రైలర్ వచ్చేసింది. విజయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ బయోపిక్‌లో బాలీవుడ్ నటి Kangana Ranaut టైటిల్ రోల్ జయలలిత పాత్రలో కనిపించనుంది. సినిమా ప్రపంచం నుంచి జయలలిత రాజకీయాల్లోకి ఎలా వచ్చారు ? రాజకీయాల్లోకి వచ్చాకా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని తమిళనాడు సీఎం అయ్యారు అనే అంశాలన్నింటినీ జయలలిత బయోపిక్ తళైవి మూవీలో చూపించనుండగా.. ఆయా సన్నివేశాలకు సంబంధించిన బిట్స్‌ని ఈ ట్రైలర్‌లో పొందుపరిచారు. 

బాహుబలి మూవీ రచయిత, ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ జయలలిత బయోపిక్ మూవీకి స్టోరీ అందించారు. 1989లో తమిళనాడు అసెంబ్లీలో కొంతమంది DMK MLAs జయలలిత చీర కొంగు పట్టుకుని లాగిన వివాదాన్ని మహాభారతంలో ద్రౌపదికి జరిగిన అవమానంతో పోల్చుతూ సన్నివేశాన్ని మలిచిన తీరు జయలలితో ఆగ్రహావేశాలకు అద్దం పట్టింది. 

Also read : 67th National Awards winners list: 67వ నేషనల్ అవార్డ్స్‌లో సత్తా చాటిన తెలుగు చిత్రాలు ఇవే

ప్రముఖ నటుడు అరవింద్ స్వామి ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో నటించారు (Arvind Swamy as MGR). Thalaivi trailer జయలలిత బయోపిక్‌పై అంచనాలు పెంచింది. ఆడదానిని తక్కువగా అంచనా వేస్తే ఆ తర్వాతి పరిణామాలు ఎలా ఉంటాయనే సందేశాన్ని సైతం Jayalalitha biopic movie ఇవ్వనుందని తళైవి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News