Telangana: ఆర్ఆర్ఆర్‌ను ఇండియా అధికారికంగా ఎందుకు పంపలేదు

Telangana: అందరూ ఊహించినట్చే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కొట్టేసింది. నాటు నాటు పాట అదరగొట్టేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగరీలో ఆస్కార్ దక్కించుకుని నాటు నాటు పాట ఘాటు ఏంటనేది అందరికీ చూపించింది. అదే సమయంలో ఆస్కార్ వరకూ సాగిన ఆర్ఆర్ఆర్ జర్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 13, 2023, 02:27 PM IST
Telangana: ఆర్ఆర్ఆర్‌ను ఇండియా అధికారికంగా ఎందుకు పంపలేదు

Telangana: ప్రశంసలు లభించాక అందరూ అక్కున చేర్చుకుంటారు. అవార్డు చేజిక్కించుకున్నాక ఇదంతా మా ఘనత అంటారు. కానీ ఆస్కార్ వరకూ సాగిన ఆర్ఆర్ఆర్ ప్రస్థానంలో ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యాయనేది కొత్త చర్చకు దారి తీస్తోంది. 

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్థానంపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. నాటు నాటుకు అవార్డు దక్కడంపై దేశం మొత్తం స్పందిస్తోంది. ప్రధాని మోదీ సహా అందరూ అభినందనలు కురిపిస్తున్నారు. సినీ ప్రముఖులైతే వరుసగా ట్వీట్ల రూపంలో లేదా నేరుగా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. అదే సమయంలో ఆస్కార్ వరకూ ఆర్ఆర్ఆర్ ప్రస్థానం ఎలా సాగిందనేది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. దీనిపై ఎవరూ పెద్దగా స్పందించకపోయినా..మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. 

మంత్రి శ్రీనివాస్ ఏమన్నారు..

ఆస్కార్ అవార్డుల విషయంలో కేంద్రం తెలుగువారిపై వివక్ష చూపించిందని ఆరోపించారు.  ఉత్తరాది సినిమాలకు ఇచ్చిన ప్రాధాన్యత దక్షిణాది సినిమాలకు ఇవ్వలేదని తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాను అధికారికంగా ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. గుజరాత్ సినిమాను ఆస్కార్‌కు పంపించి..ఆర్ఆర్ఆర్ సినిమాను పంపించకపోవడం ఇందుకు నిదర్శనమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

వాస్తవానికి ఆర్ఆర్ఆర్ సినిమాను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండియా తరపున షార్ట్ లిస్ట్ చేయలేదు. అంతేకాదు..మార్కెటింగ్, పాపులారిటీ ఆధారంగా ఆస్కార్‌కు ఎంపిక చేసేస్తారా అని వెటకారం చేశారు ఎఫ్ఎఫ్ఐ ప్రతినిధులు. ఆర్ఆర్ఆర్ సినిమా స్థానంలో గుజరాతీ సినీ ఛెల్లో షోను పంపించింది. ఈ సినిమా ఆస్కార్ ఎంట్రీ కూడా కాలేకపోయింది. మరోవైపు ఇండియా తరపున నామినేట్ కాకపోవడంతో ఫారిన్ ఎంట్రీ కింద ఆర్ఆర్ఆర్ సినిమాను ఆర్ఆర్ఆర్ నిర్మాతలే సొంతంగా పంపించుకున్నారు. ఇక ఆ తరువాత అన్ని దశలు దాటి ఆస్కార్ కైవసం చేసుకుంది. 

Also read: Oscar 2023: ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ టీమ్స్‌కు ప్రధాని మోదీ, వైఎస్ జగన్, కేసీఆర్ అభినందలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News