Radhe Shyam: తెలంగాణ సర్కార్ కీల‌క నిర్ణ‌యం.. ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీ!!

5th show for Radhe Shyam in Telangana. ప్రభాస్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాధేశ్యామ్‌ సినిమా ఐదవ షోకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2022, 04:48 PM IST
  • మార్చి 11న రాధేశ్యామ్‌ విడుదల
  • తెలంగాణ సర్కార్ కీల‌క నిర్ణ‌యం
  • ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీ
Radhe Shyam: తెలంగాణ సర్కార్ కీల‌క నిర్ణ‌యం.. ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీ!!

Telangana Govt Gives permission to present 5th show for Radhe Shyam Movie: రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్‌, బుట్టబొమ్మ పూజా హగ్డే జంటగా నటించిన సినిమా 'రాధేశ్యామ్‌'. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చిన రాధేశ్యామ్‌.. చివరికి మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతోంది. 1970 నాటి వింటేజ్ ప్రేమ కథతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

రాధేశ్యామ్‌ విడుదల కోసం ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామని రెబల్ స్టార్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. రాధేశ్యామ్‌ సినిమా ఐదవ షోకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 11 నుంచి 25 వరకు రాధేశ్యామ్‌ సినిమాకు ఐదవ షో రన్ చేసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రభాస్ ఫాన్స్ ఎంజాయ్ చేస్తుంటే.. ఏపీలో మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం లేకపోలేదు.. శుక్రవారం విడుదల కానున్న రాధేశ్యామ్ సినిమా టికెట్స్ ఏపీలో ఇంకా విడుదల కాలేదు. ఇటీవల వచ్చిన కొత్త జీవో 13 ప్రకారం.. ఏపీలో 20 శాతం షూటింగ్ చేసుకున్న సినిమాలకు మాత్రమే 10 రోజుల పాటు ధరలు పెంచుకునే అవకాశం ఉంది. దాంతో ఎప్పుడో షూటింగ్ పూర్తిచేసుకున్న రాధేశ్యామ్ సినిమాకు ఈ కొత్త జీవో వర్తించదు. అయితే రాధేశ్యామ్‌, ఆర్‌ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలకు ధరలు పెంచుకోవచ్చని ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో చూడాలి. 

Also Read: Radhe Shyam: రాధేశ్యామ్‌కు తప్పని కొత్త జీవో చిక్కులు.. ఇంకా ఓపెన్ కాని టికెట్స్ కౌంటర్స్!!

Also Read: Samantha Remuneration: సమంత షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్కో సినిమాకు ఎంత డిమాండ్ చేస్తోందంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News