భయపెడుతున్న టాక్సీవాలా ట్రైలర్

ఆసక్తిరేపుతున్న టాక్సీవాలా ట్రైలర్

Last Updated : Nov 11, 2018, 11:36 PM IST
భయపెడుతున్న టాక్సీవాలా ట్రైలర్

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా మూవీ ఈ నెల 21న విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం టాక్సీవాలా ట్రైలర్ విడుదలైంది. టాక్సీవాలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ టాక్సీవాలా ట్రైలర్ విడుదలైంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి హిట్స్ ఇచ్చిన జోష్‌తో కెరీర్‌లో మరింత జోష్‌తో మున్ముందుకు దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ చేసిన ఈ సినిమా అతడికి మరో సూపర్ హిట్‌ని అందిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్టుగానే టాక్సీవాలా మూవీ ట్రైలర్ సైతం రౌడీ అభిమానులను ఆకట్టుకుంటోంది. 

రాహుల్ సంక్రిత్యన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జవాల్కర్, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమా ద్వారా ప్రముఖ మళయాళం మ్యూజిక్ కంపోజర్ జేక్స్ బిజోయ్ టాలీవుడ్‌కి మరో కొత్త మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు.

Trending News