Vijay Sethupathi: ‘షేమ్ ఆన్ విజయ్ సేతుపతి’ అంటూ.. నెటిజన్ల ఆగ్రహం

సౌత్ స్టార్, తమిళ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కి దక్షిణ భారతదేశంలో ఓ ప్రత్యేక క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. తరచూ విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ.. విమర్శకుల ప్రశంసలు పొందే ఈ స్టార్.. ఈ సారి వివాదంలో చిక్కుకున్నారు. శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ ( Muttiah Muralitharan biopic ) రియల్ స్టోరీ ఆధారంగా 800 అనే టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Last Updated : Oct 14, 2020, 03:29 PM IST
Vijay Sethupathi: ‘షేమ్ ఆన్ విజయ్ సేతుపతి’ అంటూ.. నెటిజన్ల ఆగ్రహం

Vijay Sethupathi trolled for biopic on Muttiah Muralitharan: సౌత్ స్టార్, తమిళ హీరో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కి దక్షిణ భారతదేశంలో ఓ ప్రత్యేక క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. తరచూ విభిన్నమైన సినిమాల్లో నటిస్తూ.. విమర్శకుల ప్రశంసలు పొందే ఈ స్టార్.. ఈ సారి వివాదంలో చిక్కుకున్నారు. శ్రీలంక స్పీన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ ( Muttiah Muralitharan biopic ) రియల్ స్టోరీ ఆధారంగా 800 అనే టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ( Vijay Sethupathi as Muttiah Muralitharan ) ముత్తయ్య మురళీధరన్ పాత్రలో నటిస్తున్నాడు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఎం.ఎస్. శ్రీపతి డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఈ 800 మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కి ముత్తయ్య మురళీధరన్, విజయ్ సేతుపతి అభిమానుల నుంచి మంచి స్పందన కనిపించిన కొన్ని గంటల్లోనే.. వివాదంలో చిక్కుకుంది. Also read: 800 first look: ముత్తయ్య మురళీధరన్‌ని దించేశారు

అయితే ఈ చిత్రంలో నటిస్తుండటంపై సేతుపతిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు #షేమ్‌ఆన్‌ విజయ్‌సేతుపతి ( #ShameOnVijaySethupati ) అంటూ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌ ప్రారంభించారు. శ్రీలంక ప్రభుత్వం చారిత్రాత్మకంగా తమ దేశంలోని తమిళులను అణచివేస్తున్నది. లక్షలాది మంది తమిళులను ఊచకోత కోసిన దేశం, జాతి ఆధారంగా వివిక్ష చూపించే దేశానికి ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్‌ పాత్రలో మీరు నటిస్తారా.. ఇదేనా తమిళ ప్రేక్షకుల పట్ల మీరు చూపే కృతజ్ఞత అంటూ
నెటిజన్లు విజయ్ సేతుపతిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది. 

ఈ క్రమంలో ఈ బయోపిక్‌ చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని.. నిజాల్ని నిర్భయంగా చూపిస్తామని మూవీ మేకర్స్‌ ప్రకటించారు. ముత్తయ్య మురళీధరన్‌ జీవితంలో కనిపించని అనేక కోణాలు తెర మీదకు వస్తాయని తెలుపుతున్నారు. అయితే ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భారత భాషలతో పాటు హిందీ, బెంగాలీ, సింహళ భాషలలో కూడా ఈ చిత్రాన్ని డబ్ చేస్తున్నారు. అయితే ముత్తయ్య మురళీధరన్ టెస్ట్ క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన ఏకైక క్రికెటర్‌గా తన రికార్డు సువర్ణాక్షరాలతో లిఖించిన విషయం తెలిసిందే. దీంతోపాటు మురళీధరన్ 350 వన్డేలు, 12 టీ 20 ల్లో వరుసగా 534, 13 వికెట్లు పడగొట్టాడు. ఆయనపై తీస్తున్న ఈ సినిమాను ప్రారంభ దశలోనే వ్యతిరేకిస్తుండటంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. Also read: Rajinikanth: రజినీకాంత్‌పై ఆగ్రహం వ్యక్తంచేసిన మద్రాస్ హైకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News